పుట:VrukshaSastramu.djvu/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

284

గు చేయుదురు. దీనిని వలలకు రాచిన అవి చాల గట్టిగానుండును.

తొండ్ర చెట్టుకు ముండ్లు గలవు. ఆకులు కొంచెము సన్నముగా నుండును.

నల్ల ఊలిమేర చెట్టు మగపువ్వులు తుగ్గులుగా నుండును దానికి ముండ్లు కలవు చిన్న చిన్న కొమ్మలే వాడియై ముండ్లగు చున్నవి. ఈ చెట్టు వేసవి కాలములో పుష్పించును,

ముళ్ళతుమ్మిక చెట్టునకు వాడిగ నుండు ముండ్లు లేవు. చిన్న చిన్న రెమ్మల చివరలు కొంచెము సన్నముగా నుండి ముళ్ళ వలె వున్నవి. స్త్రీపుష్పము నందు నాలుగు గొడ్డు కింజల్కములున్నవి.


లోధ్ర కుటుంబము.


ఈచిన్నకుటుంబము నందు చెట్లును, గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంటరి చేరిక, కణుపు పుచ్ఛములు వుండవు. కణుపు సందుల నుండి యైనను కొమ్మల చివర నుండి యైనను రెమ్మ గెలలు గాని కంకులు గాని వచ్చును. కొన్నిటిలో మాత్ర మొక్కక్కచో నొక్కొక్క పుష్పము మాత్రము గదు. పువ్వులు తెల్లగానుండును. చిన్నతమ్మెలు గలవు. పుష్పకోశము సంయుక్తము. నాలు గైదు దంతము లుండును.