పుట:VrukshaSastramu.djvu/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

వీనికి కణుపుపుచ్చములు లేవు. కొన్ని పోతు చెట్లు కూడ గలవు. పుష్పములు సరాళములే. వీనికి చేటికలున్నవి. పుష్ప కోశము దళ వలయము సంయుక్తము. కింజల్కములు దళ వలయపు తమ్మెలన్నియో వానికి రెండు మూడు రెట్లో యుండును. వృంతాశ్రితములు. కీలములు 2 మొదలు 8 వరకు వుండును.

తుమ్మిక చెట్టు ఒరిస్సా, మలబారు., ఆంధ్ర దేశమున సింహళములో ఎక్కువగా పెరుగు చున్నది. దీని నుండి మిక్కిలి విలువగు కలప వచ్చును. మాను మధ్య నుండు నల్లని భాగమే మంచిది. చుట్టు తెల్లగ నున్నది అంత గట్టిగా నుండదు. ఈ కలప చెక్కడపు పనులులకు చాల యనుకూలముగ నుండును. దీని పండ్లను తిందురు. బెరడు నూరి మెరియపు పొడితో కలిపి యిచ్చిన జిగట విరేచనములు కట్టు నందురు.

తుమ్మిక యను పేరతోడనే మరియొక చెట్టు గలదు. ఇదియు కొంచెము పై దాని వలెనే యుండును. దీనిఆకులు కొంచము పొడుగాను, బెరడు నున్నగాను నుండును. మగ పుష్పములందు కింజల్కములు నలుబది గలవు. మిధున పుష్పము నందు మూడో నాల్గో యున్నవి. దీని పండ్లను కూడ తిందురు గాని అంత బాగుగనుండవు. పచ్చికాయలరసము వలలకు చీకి పోకుండుటకై పూసెదరు.