ఈ పుట ఆమోదించబడ్డది
258 యన్నిటి ఆకులు అభి ముఖ చేరికగ నుండును. కణుపు పుచ్చములు రెండాకులకు మధ్యగా నుండును. పువ్వులన్నియు సరాళములు. దళవలయమున కైదు తమ్మెలు గలవు. కింజల్కములు దీని కంటి యుండును. అండాశయము నీచము. రెండు గదులు గలవు. ఈ కుటుంబమును, అండాశయము యొక్క గదులలో ఒక్కొక్క గింజయో, ఎక్కువయో దళ వలయపు తమ్మెలు తాకు చున్నవో, అల్లుకొని యున్నవో, కాయ పగులునో, కండ కాయయో, ఇట్టి వానిని బట్టి జాతులుగను, తెగలుగను విభజించి యున్నారు.
- తొగరు చెట్టు
- - వెనుక తొగరి వేళ్ళనుండి పచ్చని రంగు చేసెడి వారు గనుక వానిని విస్తారముగ బెంచెడి వారు గాని ఇప్పుడు పై దేశముల నుండి చౌక రంగులు వచ్చు చుండుట చేత పూర్తిగ మానినారు. అప్పుడంత విస్తారముగ బైరు చేయుట వలన ఏబది అడుగులెత్తు పెరుగు చెట్లు మూడు నాలు గడుగులు ఎదిగి పెరుగునవిగా కూడ మారినవి. వానిని ఇసుక నేలలలో పొలము బాగుగ దున్ని విత్తులు నాటి మొలిపించెడి వారు. కాయల నుండి విత్తులు తీయుటయే కొంత కాలము పట్టును. కొన్ని చోట్ల విత్తనములకై క్రిందటి సంవత్సరపు పైరు నుండి తీసిన కాయలను, మరి కొన్ని తోట్ల దగ్గరి నున్న చెట్ల కాయలను ఉపయోగించెడి వారు. కాయలను దెచ్చి