ఈ పుట ఆమోదించబడ్డది
254
1.దళవలయము, కింజల్కములు, 2. ఫలము, 3 కీలము.
- పుష్పకోశము
- - సంయుక్తము. గొట్టము వలెను, పొట్టిగాను వుండును. ఉచ్చము. అండాశయముతో కలిసి పోయి వున్నది.
- దళ వలయము
- - సంయుక్తము. తమ్మెలు గలవు. మొగ్గలో ఒకదానినొకతటి తాకుచు వుండును. త్వరగా రాలి పోవును.
- కింజల్కములు 5. దళవలయము నంటి యున్నది. కాడలు పొట్టివి. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
- అండ కోశము
- - అండాశయము నీచము. రెండు గదులు. కాని, ఒక పొర అడ్డముగా ఏర్పడుట చేత నాలుగు గదుల వలె నగు పించును. కీలము సన్నము. కాయ ఒక పువ్వు సందు నుండి ఏర్పడినది గాదు. అన్ని పువ్వుల పుష్ప కోశములు అండాశయములు కలిసి ఏర్పడుచున్నవి.