పుట:VrukshaSastramu.djvu/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకర చెట్టు:- పెద్దవృక్షము. ఆకులు చాల వెడల్పుగా నుండును. పుప్పొడి తిత్తులు 30 వరకు గలవు. పువ్వులు ఎర్రగా నుండును.

గుర్రపు బాదము:- చెట్టు తోటలలో బెరుగు చున్నది. దీనిగింజలనుండి చమురు తీయుదురు. చమురు కొంచెము పచ్చగా నుండును గాని వాసన యుండదు. దీనిని ఔషదములలో నుపయోగించెదరు.

ఉద్రిక చెట్టు:- తోటలలోను అడవులలో కూడ బెరుగు చున్నది. పువ్వులు చిన్నవి. పచ్చని రేకులు గలవు. దీని బెరడుతో గషాయము కాచి ఔషధములలో వాడుదురు.

వలంబారి చెట్టు:- అడవులలో బెరుగును. దీనికాయలు పొడుగుగా మెలిపెట్టి కొనియుండును. ఈ మెలి, గింజలను వెదజల్లుట కొక సాధనమగుచున్నది. కాయలెండి మెలి విడిపోవు నప్పుడు లోపలి గింజలు కదలి బైట పడును. ఈ కాయలను బొడుము చేసి ఔషధములలో వాడుదురు.

బంధూకము:- వరిచేలవద్ద బెరుగును. ఆకులు సన్నముగా పువ్వు లెర్రగా నుండును.