Jump to content

పుట:VrukshaSastramu.djvu/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

పెద్ద పావలి కూరయు, సన్న పావలి కూరయు:...మిక్కిలి తేమగా నున్న చోటుల బెరుగు చున్నవి. వీనిని కఋవు కాలమందు వండుకొని తిందురు. మరియు ఈని పచ్చి యాకులును, గింజలను కూడ నౌషదములలో వాడుచున్నారు. గింజలు మూత్ర విసర్జనమప్పుడు కలుగు మంట మొదలగు జబ్బులకును, శగకును, వాడుదురు. శరీరము నొప్పులుగా నుండి మందు కట్టవలసి వచ్చినపుడు, మందునకు బదులుగా, వచ్చి యాకులను నూరి గట్టవచ్చు నందురు.

పొన్న కుటుంబము.


ఇదియొక చిన్న కుటుంబము. దీనిలో పెద్దచెట్లు, గుబురు మొక్కలు మాత్రము గలవు. ఈ మొక్కలలోను, జిల్లేడు మొక్కలో నున్నట్లు పాలుగలవు గాని అవి చిక్కగాను, సాధారణముగ పచ్చాగాను నుండును. ఆకులు లఘు పత్రములు, అభిముఖ చేరిక, నున్నగా నుండును. పువ్వులలో నేకలింగ పుష్పములు మిధున పుష్పములు గూడ నున్నవి. పుష్ప కోశపు తమ్మెలు మొగ్గలో నల్లుకొని యుండును; ఇది ఈ కుటుంబము యొక్క ముఖ్య లక్షణము.

పొన్నచెట్టు మనదేశములో చాలచోట్ల పెరుగు చున్నది. తురాయి ఆకుల వలె దీని యాకులు ఒక్కమాటు రాల