పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

59


యొక్క భావికము శుభముతో నలంకరింపఁబడఁగలదు. తురకలయొక్క దుష్కృతు లే హిందువుల నిట్లు ప్రేరేపించు చున్నవి. ఏ నాఁడే సామ్రాజ్యము దుర్మార్గాచరణమున కును బ్రజాపీడనమునకును దిగునో అది యానాఁడే యంత రించునని 'పెద్దలు వచింతురు. అది వ్యర్ధము కానేరదు. భరతఖండమున కెప్పుడేని యీయవస్థ కలుగకపోదు. నాశక్తి కొలఁది నా దేశమునకు సేవఁ జేసి,వలయు నేని నా జనని పాదపద్మముల నీ యాంధ్ర రక్తముతోఁగడిగి వీర స్వర్గమును నిశ్చింతగా నందెడను.

అతని కనులయందు శాంత భావము స్ఫురించుట లేదు. అవి రక్తవర్ణములై యుండెను.

జగన్మో :-వీరకుమారా ! దుడుకుతనము నీకుఁ జిన్నప్పటినుండి యుఁగూడనలవాటే. నీయాకృతి యిపుడు భయంకరముగా నున్నది ; నీప్రస్తుత స్థితి యెట్లున్న దో చూతమని యంటిని. ఇంత మాత్రమున కే యిట్లు రౌద్రమూర్తివి గానలెనా' ? ఆ యమృత సారములయిన వాక్కులచే నతని కోపాగ్ని కొంచెము చల్లారెను.

విజయ : జగన్మోహినీ ! అదియేమో నాకుఁ దెలియదుగాని భరతఖండ ప్రస్తుత స్థితిని జూడఁగనే, ఈ దేశ దుర్దశం దలపోయఁగ నే స్వాభావికముగా, అప్రయత్నముగా, ఒక