పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

57



సారి వచ్చి చూచి పోవుటకు సీకుఁదీరిక లేక పోయినదా!” ఆమె మెల్ల గాఁ గ్రిందికిఁజూచెను.

విజయ :-రాజసేవ మిక్కిలి దుష్కరమనుట నీవెఱుఁగవా ! ఎంత ప్రయత్నించినను నాకురావలను పడినదిగాదు. యాలస్యమునకు క్షమింపుము.

జగన్మో:--విజయసింహా ! యుద్యోగ విధులనన్ని టిని జక్కఁగా నిర్వర్తించుచుంటివి గదా ! మానవులకుఁ దమ విధుల నెఱ వేర్చుకొనుటకంటె గర్తవ్యము లేదు. అది ప్రధానము.

విజయ: అవును. నీ వన్నది సత్యమే. నా యెఱిఁగినంతవఱకు లోటుపాటులు లేకుండ నావిధిని నెటు వేర్చుకొంటిని.

జగన్మో: నీకుఁ దెలియని యంశములనియుఁ గాదు, విధిని నెఱ వేర్చుటయే పరమ ధర్మముగాఁ దలను దాల్చుటకు బద్ధకం కణుఁడవు కావనియుఁ గాదు. కాని యుద్యోగ వశమునఁ బ్రమత్తులగుట మనుజులకు స్వాభావికము. నీ స్వభావమం దుకు వ్యతి రేకము. అయినను స్నేహముచేఁ జెప్పుచుం టిని. చిన్న నాఁటి నీ స్వ దేశ రక్షణోద్దేశమును మఱవలేదు గదా ! చిన్న తనమున గ్రంథములు పఠించుకొనుచు భరత ఖండము యొక్క దుస్థితిని గూర్చియుఁ దురుష్కుల కంటక మగు పరిపాలనముం గూర్చియుఁ బెక్కుసారులు మనము సవిచారముగాఁ జర్చించుకొను చుండెడివారము. అప్పుడు నీ కనులొక్కొక్కప్పుడు సబాష్పములును, ఒక్కక్క-