పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానచంద్రికా గ్రంథమాల.

చింతాద్రి పేట-మద్రాసు


ఈ గ్రంథములను గవర్నమెంటు వారు పఠనీయములు గా నుంచుటకు సమ్మతి నిచ్చియున్నారు. 21-10-18. పేజీ 565 పోర్టు' సెంటు జార్జి జార్జ్ గెజటు.

1.

రాణీ సంయుక్త

జగద్విఖ్యాతమై, నాలుగు నాటక రచనలకు మార్గదర్శక మై, శైలియం దును వర్ణనలయందును, కథాచమత్కారమునందును నిరుపమాన మై పండితుల చేతను, పామరులచేతను, పొగడ్తగన్న ఈ అద్భుత నవలను గురించి ఎంతప్రాసినను తనివిదీరదు. దీనింజది? యిందలి స్వారస్యమును పాఠకు లే గ్రహీంతురు గాక ! గ్రంథకర్త. వేలాల సుబ్బారావు. 0-1220 లు మాత్రమే.


2. హిందూమహాయుగము

ఇది 260 పుటల గొప్పచరిత్ర గ్రంథము. హిందూ దేశ కథాసంగ్ర హముయొక్క మొదటి భాగము. మనపూర్వుల రాజ్య విస్తారంబును, ఆప్రతిమ శౌర్యమును, అకలంక స్వదేశభక్తియు, తెలిసికొనగోరు వారీగ్రంథమును తప్పక చదువవలయును. అత్యంత పుగాతనకాలమునుండి మహమ్మదీయుల దండయాత్ర వరకు గల చరిత్రమంతయు సవిస్తరముగా వర్ణింపఁబడినది. బుద్ధ, అశోక, కనిష్క, కాళిదాస, శ్రీహర్ష , చంద్రగుప్త, భవభూతి నన్నయ, తిక్కన మొదలయిన పవిత్ర జీవితములు. శ్రద్ధతో వ్రాయఁడినవి ఇది యింతవరకు ఐదుకూర్పులుపడి యెంతో జనసమ్మతమును వడసి యున్నది. ఇట్టిది తెలుగులో లేదు. అనేక పరీకులకును, పాఠశాలలయందును పఠనీయుముగ నియమించియున్నారు. నియమించుచున్నారు. గ్రంథకర్త. కే. వి. లక్ష్మణరావు, ఎం. ఎ., 'వెల రు. 1-0-0 మాత్రమే.

3. పదార్థ విజ్ఞానశాస్త్రము

దీని నింగ్లీషులో ఫిజిక్సు ఆనెదరు. ఇది గొప్పశాస్త్రీయ గ్రంథము, ఇంద-నేక. 'యపూర్వవిషయములు వర్ణించబడినవి. పాఠశాలలోని 1, 2, 8. ఫారములగును "ట్రైనింగుస్కూళ్లకును అనుకూలముగ నుండునట్లు వ్రాయఁ బడినది. వెల 0-12-0 లు. గ్రంథకర్త. ఎం. సాంబశివరావు, బి.ఏ., ఎల్.జి.