పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియొక టవ ప్రకరణము

163



'అయ్యా ! మిమ్ములను విడుదలచేయుచున్నాను' అని యాయధికారి యనెను.

“ కృతజ్ఞులము ' అని యిరువురు ననిరి.

"త్వరగాఁబోవలయును. గుఱ్ఱముల పై నధిష్ఠింపుఁడు' అని యాతఁడనెను.

ఆ యిరువురును ద్వరితముగా గుఱ్ఱముల నెక్కిరి. మెల్లగా స్వా రి చేయుచుండిరి. కొంతవజకు నాయధికారి వెంబడించెను. “అయ్యా ! సెలవు. మమ్ములను మఱువకుఁడు'

'మమ్ముంగూడ మజువకుఁడు'

“ఇఁక దిగువ డెదను”

“ఆఁ! మంచిది. పోవుచున్నాము.”

ఆ యధికారి కొంచెము సేపునిల్చుండి “రాజులు చపల చిత్తులు. వారిపని “ లేడికి లేచిన దే ప్రయాణ' మన్నట్లుండును. ఎప్పుడేదితోచిన నప్పుడది జరిగి తీరవలయును.” అనుకొనుచుఁ దన భవనమునకుం బోయెను.

వారుమువ్వరును సేవకులుఁ వెంబడింపగాఁ గొంతవఱకుఁ దిన్నగాఁబోయి యచ్చటినుండి మఱియొక దారికిం దిరిగిరి. అది పట్టణముయొక్క తుద. ఆప్రదేశమున విస్తారము గొప్పభవం తులు లేవు. చిన్న గుడిసెలు మాత్రముకలవు. క్రమక్రమముగా వారు నిర్జన ప్రదేశముం జేరిరి. అది భయంకరముగా నుండెను, సోమ శేఖరమూర్తి యిట్ల నెను.