పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నేడవ ప్రకరణము

123

.


అని యతఁడు పోయెను. లోపల ధనమును గైకొనెను. అతఁడొక పురుషుని వెంటఁ బెట్టుకొని తిన్నగాఁ జెఱసాలకుఁ బోయెను. అచట నతఁడు ద్వార పాలకులతో నేదియో గుస గుసలాడెను. వారిచేతీలో నిన్నిసవరసులను గుమ్మరించెను. వచ్చినవారితో నిట్లు భాషిం చెను.

"మఱి బండి సిద్ధము చేసికొనివచ్చినారా ? '

' ఆఁ ! వచ్చుచున్నది. "

" ఇంకెంత సేపగును ? "

త్వరలోనే రావచ్చును ”

అంతలో దూరమున బండిచప్పుడు వినవచ్చుచుండెను. అది యంత కంతకు సమీపించెను. తుట్టతుదక దియాచెఱ సాల ముంగిట నిలిచెను. ఆ యధికారి తనదారిని దాను బోయెను. నూత్న పురుషులిట్లు భాషించెను.

“ ఇంత యాలస్య మేల చేసితివి ? '

“ నాకు ముందుగాఁ దెలియ లేదు. ఇపుడే తెలిసినది. ”

గమ్య స్థానమునకు వారు పోయి యుందు రా ? ”

“ఆఁ ! ఇదివఱకే పోయి యుందురు

ఆ నూతన పురుషుఁ డిటునటుచూచెను.

“ ఆయుధములును మఱచి పోలేదుగదా ? ”

“ వెంట నూరి మజి తీసికొని పోయినారు "

పదిలముగా నుండవలయును సుమీ' అని చేతిలో . ,