పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునోళండవ ప్రకరణము

85

. .

ముపోదము. అంతలో నతఁడువచ్చి తలుపుతట్టెను. పట్ట మహిషి. యుత్సాహాతురమున మంచము పై నుండి దిగి తలుపు తీసెను. అతని మొగము శంకాసమన్వితముగఁ నున్నట్లున్నది. వా రిరువురును మాటలాడ లేదు. ఆపె పెడ మొగము బెట్టెను. అతఁడు దేవికోపముగా నున్నదని మాత్రము తనలో దా ననుకొనెను. ఆమె కరము పట్టుకొని యిట్ల నేను.

దేవీ ! నేఁడేల గోపముగా నున్నావు : ప్రసన్న వద నవు కమ్ము,

పట్ట: కోపమునకు మా కేమి కారణమున్నది. మాకోపము మిమ్మేమి చేయఁగలదు ?

నవా: అదిగో! కోపమును దాఁచెదవేమి ? నిజముగా నీకు గోపము వచ్చిన నేనుండ , పట్ట: వట్టి కల్లలకు దారియా డొంకా మాకుఁ గోపము వచ్చినను 'మే మే చెడుదుము. మీకుఁ గోపమువచ్చినను మేమే చెడుదుము.

నవా...ఆఁ ! తెలిసినది. నీవు ప్రొడవు. ఇది ప్రణయ కోపము.

పట్ట:-మా ప్రణయకోపము' మీకు రుచించునా? అందుకుఁ దగినవారు నూతన సుంద.

మఱి యామెనోట మాటరాలేదు. ఆమె ప్రయ త్న ముచేసి యనను లేదు.