Jump to content

పుట:VignanaSarvasvamuVol4.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4 విమర్శ యుతముగా స్వీకరించి, దాని ఆధారములను, -కల్పనలను తెలిసికొని, దానిని గ్రహించినప్పుడు, అవి యథార్థములు కావని నిరూపితమైనపుడు వాటిని పరిత్యజించి, పునర్మనన చింతనల ద్వారా, అను -భూతుల వ్యాఖ్యాన విశ్లేషణల ద్వారా నూతన విధ మైన శ్రద్ధను నిర్మించుటకు సిద్ధముగ ఉన్నప్పుడు మాత్రమే శ్రద్ధ నిజముగా దర్శనమగును. జ్ఞాన వస్తు కర్మలను -పరీక్షించి, లోకమును గూర్చి, మానవుని గురించి, ఆదర్శములను, విలువలను గురించి ఏర్పరచుకొన్న శ్రద్ధామయ దృష్టి దర్శన మని ఇట్టి వారి అభిప్రా యము. ఇట్టి శ్రద్ధ విజ్ఞానమునకు, ప్రత్యక్ష అనుభవ -మునకు భిన్నముగా ఉండదని వీరందురు.

సమగ్ర దర్శనము : సరియైన సమగ్ర దర్శ నము ఈశ్వరుని, లేదా ఏదో ఒక లోకోత్తర సత్త అభివ్యక్తివలన, పరమ సత్యముయొక్క ఆపావర ణము (revelation or unveiling) వలన ఏర్పడు నని, దార్శనికుల పని ఆటువంటి అభివ్య క్తిని, లేదా అపావరణమును అవగాహనము చేసికొనుట, వివరించుట, విస్తరించుట, దాని దృష్ట్యా విశ్వమును వ్యాఖ్యానించుట, మానవ గమ్య కర్తవ్యాదులను నిర్ణ యించుట అని కొందరి మతము. ప్రవక్తల, ఋషుల మనస్సులలోను, అవతార పురుషుల సనాతన పవిత్ర గ్రంథముల ద్వారాను ఇట్లు సత్యప్రకాశనము జరి గిన దని, దానిని గ్రహించి అర్థము చేసికొని ఆచ రించుట అవశిష్టమని వీరల విశ్వాసము. 'ప్రత్యక్షాను భవముపైన, హేతువాద తర్క మానవ బుద్ధుల పైన -ఆధారపడు దర్శనములు అసంపూర్ణములు, అప్రతిష్ఠి -తములు' అని వీరు అందురు. 'మా దర్శనమే సంపూ -ర్ణము, సుసంగతము, పూర్తిగా బుద్ధిపై నిర్మితము' అనువారు చాలామంది కలరు. వీరందరి దర్శనములు పరస్పర బాధితములు, ప్రతితంత్ర సిద్ధాంతములు.* అట్లే 'మా ఋషి, మా ప్రవక్త, మా దివ్యగ్రంథమే

దర్శన స్వరూప స్వభావములు పరమ సత్యమును సాకల్యముగ, నిరవశేషముగ చాటినది. అదే మానవులందరికి శరణ్యము.' అనువారు చాలమంది ఉన్నారు. వీరందరి విశ్వాసములు, ప్రతి పాదనలు, క్రియాకలాపములు కూడ పరస్పర వ్యాహ తము లగుచు విరుద్దములుగానే ఉన్నవి. శ్రద్ధయే దర్శనము అనువారిలో స్వపక్షాభిమానము ఇంతగా ఉండదు. కాని అశ్రద్ధ, సందేహవాదము, నాస్తి వాదము - ఇవి దర్శనములు, జీవిత మార్గదర్శక ములు కావని, విజ్ఞాన ప్రత్యక్షానుభవముల కందనిది. కలదని, ఇది గుర్తించకపోవుట తప్పు అను ఆగ్ర హము మాత్రము వీరికి ఉన్నది. కొందరు పెద్ద మను ష్యులు ఏదో రుచులలోని వైచిత్ర్యము వలన రకరక ములుగ దృష్టులు ఏర్పడునని, అన్నిటిలోను సత్యము ఉన్నదని, ఇది తెలిసికొనలేక కేవలము సంజ్ఞలను గూర్చి వివాదములు జరుగుచుండునని, అన్ని యు సత్యమును చేరుటకు మార్గములే నని, అన్ని నదులును సముద్రమునే చేరునట్లు అన్ని మార్గములును ఒకే గమ్యమును చేరు నని ఘోషించుచున్నారు. వీరిలో కొందరు అన్ని దృష్టులు సత్యదృష్టు లైనను అందులో ఒకటే సంపూర్ణము, వ్యాపకము అగు నని, తక్కినవి పాక్షికముగ, ఆంశికముగ మాత్రమే సత్యమగు నని, కాబట్టి అవి పరిహార్యములు, త్యాజములు అని, అట్లే అన్ని మార్గములు ఒక గమ్యమునకే దారితీసినను అందులో ఒక టే ఋజువైన రాజపథ మని, తక్కినవి డొంక తిరుగుడుగ ఉండు కుటిల మార్గము లని చెప్పు చున్నారు. 'ఇదిగో వేదాంతమే సరియైన దర్శన'మని, 'కాదు థామస్ మతమే సరియైనదని, 'రెండును కాదు మార్క్స్మతమే అసలు నిండైన, నిజమైన దర్శనము' అని - ఇట్లు పరస్పర విరుద్ధముగ లెక్కలేనన్ని ప్రతి పాదనలు ఉన్నవి. 'దృశ్యతే అనేన ఇతి దర్శనమ్' - అనగా దేని వలన చూడబడునో అది దర్శనము అని అర్థము. చూడబడునది ఏదిః సత్యము, లేదా మనుష్యుల, వస్తు వుల, క్రియల, వాగర్థములు, శాస్త్రవిజ్ఞానముల, ఇతి హాస కళా కౌశలముల - ఇంత ఎందుకు - ఇంత ఎందుకు - విశ్వము, అందలి పదార్థములయు నిజస్వరూపము; యథార్థ

  • ప్రతితంత్రసిద్ధాంత మనగా ఏదో ఒక దర్శన

మునకు మాత్రమే సమ్మత మగు సిద్ధాంతము. సర్వ తంత్ర సిద్ధాంత మనగా అన్ని దర్శనములకు ను సమ్మత మగునది.