పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశకుల నివేదన

నిజాంరాష్ట్రములోని ఆంధ్రమహాశయులలో, ప్రభు సేవయందును దేశసేవయందును, విద్యాపోషణమునందును, పరోపకారపారీణయందును, నిరుపమాన విఖ్యాతి వహించిన వారును, బాలికల, పాఠశాల ముఖ్యాతి ముఖ్యులగు పోషకులును పాలకకమిటీ అధ్యక్షులు అయిన రాజా బహదరు వేంకట రామారెడ్డి ఓ.బి . ఇ. స్పెషలు ఆఫిరు సర్ఫఖానును ముభారకు గారి బోధ ప్రదమగు జీవిత చరిత్రమును శ్రీవారి డెబ్బదియవ వత్సరారంభమున ప్రటించు భాగ్యము "లభించినందునకు గర్వపడు చున్నాము.

శ్రీ రాజాబహదరు గారి జీవితమును తెనుగున ప్రకటించ మొదట సంకల్పించిన వారు ఈపాఠశాల యెక్క ప్రాత విద్యార్థిని శ్రీమతి కొమ్మిడి లక్ష్మిబాయమ్మ గారు. వీరు ఈ విషయమున నొకచిన్న పుస్తకము వ్రాసి పాఠశాల కమిటీవారికిచ్చి యండిరి. తరువాత కొలది కాలమున క్షయ వ్యాధిచే దివంగతులైరి. ఈపుస్తకమును మా పాతవిద్యార్థి సంఘము వారు ప్రకటింప సంకల్పించి శ్రీరాజాబహాదరు గారి 68 జన్మోత్సర సందర్భమున నర్పింపబడిన సన్మానపత్రములో తమ యుద్దేశమును సూచిం చియుండిరి. కాని శ్రీరాజాబహదరు గారి జీవిత విశేషములు అతి కొద్ది పుస్తకములలో నిమడజానందుప శ్రీయుత సురవరము ప్రతాపరెడ్డి గారు, ఇట్టి యుయుద్గ్రంధమును రచించి, పటములు సేకరించి గ్రంధము యొక్క అంత స్వరూపమును బహిన్స్వ రూపమును ఆకర్షకముగా నుండునట్లు సిద్ధబరచి యిచ్చిరి. ఇట్టి యుత్తమ చరిత్రను రచించిన వీరు మా వ్యందులులు. మూలగ్రంధ రచయిత్రి శ్రీమతి లక్ష్మీ బాయమ్మ గారు జీవించియుండినచో, నేడు ఆమె యానందము అపారము గామండెడిది.

శ్రీరాజాబహదరు గారి సేవాభక్తి యదార్యమును మేమీ విజ్ఞప్తి యందు ఎక్కువగా ప్రస్తావించదలచలేదు.తలచినను ఆది పౌధ్యము గాదు. ఈ నిజాం రాష్ట్రంలో 50 సంవత్సరములకంటె ఎక్కువ కాల