పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15


ప్రేమించి, పోషించుచు వచ్చిన మేనమామ, అకాలముగా మృత్యువు వాతబడిరి. కుటుంబ వ్యవహారము లంతయు కల్లోలములలో బడెను. ఈదుర్వార్త విన్న తర్వాత వహబు గారి అన్న గారును, తల్లియగు కిష్టమ్మగారును, మామయగు రామన్న అను వారును రాయచూరుకు వచ్చి వహబుగారు చేసినకొన్ని బాకీల క్రిందికి గాను వారి సామానులనమ్మి, మిగతవానిని బండ్ల పై నెక్కించి రాయణి పేటకు పంపిరి. కుటుంబము వారి నందరిని కూడ రాయచూరు నుండి తరలించిరి. వేంకటరామా రెడ్డి గారిని కూడ వెంట తీసుకొనిపోవువాడై యుండిరి. కాని దైవఘటన ఇంకొక విధమ గానుండెను. అచ్చట ఆనాడు జరిగిన చిన్న ఘట్టమే వేంకటరామా రెడ్డిగారి జీవితమును పూర్తిగా నింకొక మార్గములో నడిపించెను.


  • [1]ఈ ప్రకరణమ'ను ముగించుటకు పూర్వము, హైద్రాబాదు రాజ్యములో విలియం వహబుగారి కాలములో పోలీసుశాఖలోని ఏర్పాటులను, వారిపరిపాలన, దేశ పరిస్థితులు, ఎట్లుండెనో సంగ్రహముగా తెలిసికొనుట అవసరము. అప్పుడు అనగా సుమారు 20 - 20 సంవత్సరముల క్రిందట, సర్ సాలార్జంగు గారు ప్రధానమాత్యులుగా నుండిరి. వారి కాలములోనే
  • వివరములకై మిర్ విలాయతు హసేను గారు వ్రాసిన పోలీసు డిపార్టుమెంటు చరిత్రను చూడుడు.