పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రా జా బహద్దరు వేంకట రామా రెడ్డి గారు


ప్రజోత్పత్తి నామ సం. పుష్య బ.4 . గోలకొండ పత్రికా సంపాదకీయము

ఒక వారము దినముల క్రిందట శ్రీయుత రాజాబహ ద్దరు వేంకట రామా రెడ్డి ఓ. బి. ఇ. గారి యద్యోగ కాల పరిమితి మరియొక సంవత్సరము హెచ్చింపబడె నని వినుటకు ప్రత్యాంధ్రుడే కాక నిజాం రాష్ట్రమంచుంకు సమస్త జనులును ముఖ్యముగా, నగరవాసులును చాల సంతసించు చున్నారు. సమకాలిక పత్రికయగు బులెటిన్ పత్రిక మొన్నటి సంపాద కీయమందు చేసిన మన కొత్యాలు గారి ప్రశంసతో మేము సంపూర్ణముగా నేకీభవించు చున్నామ'. ఇతర స్థలములందెచ్చట జూచినను హిందూ ముసల్మానుల కలహములు జరుగు చుండుట మనము ప్రతిదినము నినుటకు విషాదము చెందుచున్నాము. తోడి సంస్థానమగు కాశ్మీర రాజ్యమందు సుమారు 3- 4 మాసములుగా ఘోరదురంతములు జరుగుచున్నవి. కాని మన హైద్రాబాదు నగరమందు అట్టి భయము మన