పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
                     వేమన వంటివారు 97
 • తెగివచ్చినపుడు నరుకలేని యా కత్తి యేల నూరుకొని త్రాగుటకా ? యనియ నితఁడతి తీవ్రముగాఁ బలుకును.

             "ఆ. పరబలంబుఁ జూచి ప్రాణరక్షణమున
                   కురికి పాలీపోవ పిరికినరుఁడు;
                   యముఁడు అలిగితేను యవ్వరడ్డంబయా ?..." (2432))

అని వేమన్నగూడఁ జెప్పెను. కాని యీ విధమైన శౌర్యంబునందు అతనికంత యభినివేశము కానరాదు. ఇట్లు శౌర్యమునందును సంసారసుఖమునందును ఆశగలవాఁడు కావుననే యితఁడు దానిని దీర్చుకొనుటకు కొన్నాళ్లు రాజసేవ చేసినట్లున్నది. వేమనయు చేసియుండునని యూహించితిమిగాని యతనికది చాలదినములు సాఁగియుండదు. ఈ విషయమం దితనికున్నంత యనుభవ మతనికి లేదు. ఆ నిప్పును చాలనాళ్లు అణఁచిపెట్టుకొనఁగల రాజు ఆ కాలమందే కాదు, ఏ కాలమందును గలుగఁడు. ద్రవ్యార్జనకై కొన్ని దినములాపని చేసిచూచి త్వరలోనే యతఁడు విసిగి

        "ఆ. ఎంత సేవఁజేసి యేపాటుపడినను
              రాచమూక నమ్మరాదురన్న!
              పాముతోడి పొందు పదివేలకైనను..." (638)

అని తెలుసుకుని యీ పీడవదిలించుకొనెను. సర్వజ్ఞC డట్లుగాక, రాజుల చిత్తవృత్తి నాశ్రయించి నడిచి, వారి మంత్రుల యడుగులకు మడుఁగులొత్తి, కొలువులోని తక్కిన పెద్దవారియెడ వినయవిధేయతలు చూపి సేవించినాఁడు (645-660) 'స్వామి కార్యక్కె మడియలేబేకు' (706) 'స్వామి కార్యమునకై చచ్చియే తీరవలయును" అని సంకల్పించి ఒడలు దాఁచక వారికై పోరినాఁడు, కాని, జారత్వము, చోరత్వము, అసత్యము మొదలగు దుర్గుణములు వారియందు చూచి, వాని ఫలమనుభవించి విసిగి వేసరినాఁడు. *[1]తుదకు 'బిన్నపవ గ్రేళ్లదర సినోలగదింద సన్యాసలేసు' 'మనవిని వినని దొరకొలుపుకన్న సన్యాసము మేలు" (690) అని నిర్ణయంచుకొన్నాఁడు.

మొదటినుండి యితఁడును బసవేశ్వరప్రతిపాదితమైన లింగధారివీర శైవ మతమునకుఁ బేరినవాఁడు. కావున నితనికి తలఁచుకొస్నప్పడు సన్యాసమిచ్చు శివయోగులకు ఆ మతమునకుఁ జేరినవారిలో కరవులేదు. ఇట్టివారిలో నెవఁడో యితనిని జంగముగాఁ జేసి యోగమార్గ ముపదేశించినాఁడని తోఁచుచున్నది. కాని యీ యోగసాధనకు మొదలు ఇతనికి, సామాన్యముగ నందఱి వలె, బహిరంగ వేషములందు నమ్మిక కలదు. విభూతిరుద్రాక్షలు ధరించిన వానికి పాపము బయలై ఉన్నచోటికి శివుఁడు వచ్చునని యితడు తల(చెను (99). లింగములేక యేదియు తినరాదు (108). తానుభుజించు వస్తువుల నెల్ల మొదలు శివార్పణము చేసి పిమ్మట భుజింపవలెను (107). జంగములు సాక్షాచ్ఛివస్వరూపులు, వారి కిచ్చిన శివునికి నైవేద్యము చేసినట్లే (142). కావున 'తిరుదు తందాదరూ కరెదు జంగమకిక్కు' 'తిరిపెమెత్తి తెచ్చియైనను పిలిచి జంగానికి పెట్టుము' (549) అని యితనిబోధ. ఔదార్యవిషయమున వేమనవలెనే యితఁడును అతివాదియై *తిరిపెమెత్తియో పీడించియో దొంగిలించియో తెచ్చి పిలిచి దానమిమ్ము' (550)

 1. * చూ, రాజనీతిపద్ధతి,