పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 88

కొన్నవారికి నరకము వచ్చునని వారందురు (కులార్ణవ తంత్రము. 12 ఉల్లా). ముఖ్యమైన యుపాస్యమూర్తి స్త్రీరూపము గావున స్త్రీలయెడ వారికి మర్యాద యొక్కువ. ఇవన్నియు వేమన్నకు గిట్టవని వేఱుగా చెప్పఁబనిలేదు.

ఇఁక దాక్షిణాత్ములగు తాంత్రికుల గుంపులో చేరినవాఁడన్నను ఇదే కష్టము వచ్చును. దాక్షిణాత్యులలో మాత్రము తాంత్రికులు కానివారెవరు ? వైష్ణవులు, శైవులు, శంకరాద్వైతులు- అందఱును తాంత్రికులే. వారితంత్రములలో మంత్రములు, బీజములు మొదలగువాని స్వరూపములందు భేదమున్నదిగాని, సామాన్యతంత్ర స్వభావమునందు భేదములేదు. కుండలినీయోగము మొదలగు హఠసాధనలన్నియు వారును అంగీకరించినవారే. పై వామాచారు లందుఁగల భేద జాతులన్నియు మనలోను గలవు. ఇవిలేక, శక్తిపూజచేయక, వామాచారమును వదలిన తాంత్రికులు మనదేశమందున్నారా? నేనెఱుగను.

ఇఁక వామాచార తాంత్రికులకు ప్రమాణగ్రంథములగు 'కులార్ణవ తంత్రము” * మహానిర్వాణ తంత్రము” మొదలగు గ్రంథములందలి తత్త్వములకును వేమన తత్వములకును సామ్యమున్నది. కారణము స్పష్టమే. ఇరువురి మతమును అద్వైతమే. కొన్ని సమానములైన సిద్ధాంతము లనేక భిన్న మతగ్రంథములందుఁ గానవచ్చును. ఒకటి యదాహరింతును. 'కులాచారమును రహస్యముగా నుంచ వలయునను సందర్భమున కులార్గవతంత్రమున ఈ క్రింది పద్యము

            "వేదశాస్త్రపురాణాని సామాన్యగణికా ఇప
             జయంతు శాంభవీ విద్యాగుప్తా కులవధూరిప" (11 ఉల్లాస.)

ఇదే పద్యము హఠయోగ ప్రదీపిక" యందు “విద్యా యనుటకు బదులుగా, *ముద్రా" యనుమార్చుతో, 'శాంభదిముద్ర"ను గూర్చి కలదు (హఠ, ఉప 1 ప. 25). మఱియు, శిపయోగసారము నందు ఇదే శ్లోకమే యిట్లాంధ్రీకరింపఁబడిసది :

            "తే, వేదశాస్త్రములును బహువిధపురాణ
                ములును సామాన్యగణికల పోలెనుండు ;
                శాంకరీ విద్యయొకటి యీజగతిలోస
                గుప్తయై కుల స్త్రీవోలెఁ గొమరుమిగులు" (శివ - 4- ఆ)

ఈ కారణముచేత పైరెండు గ్రంథములు వ్రాసినారు కౌలతాంత్రికులన వీలులేదుగదా ! ఇదే పద్యమునే వేమన్నయు తెనిఁగించెను. కాని భాపమును మార్చెను. యిట్లాంధ్రీకరింపఁబడిసది :

             "ఆ. వేద విద్యలెల్ల వేశ్యల పంటివి
                 భ్రమల బెట్టి లేట పడఁగ నీప
                 గుప్తవిద్య యొకటె కుల కాంత పంటిది......." (3631)

అందఱికిని దొరకునది కావున వేశ్యలవంటివని వారు చెప్పఁగా ఇతఁడు 'భ్రమలఁబెట్టి తేఁటపడఁగనీవు ' కాబట్టి వేశ్యలపంటి వన్నాఁడు. కుల కాంతవలె గోపనీయమని వారు చెప్పఁగా నితఁడు గుప్తవిద్య కుల కాంతవలె మనకు సులభ ముగా ననుకూలించునను చున్నాఁడు ! ఇట్లే -యిట్లాంధ్రీకరింపఁబడిసది :

               "పుట్టమీఁదఁగొట్ట భుజంగము చచ్చునా ?"
               "ఓటికుండ నీర మొప్పగ నిలుచునా ?"
               "వంకఁదీర్ప నెవ్వరి తరమయూ?"

ఇత్యాద్యుపమానములు కులార్ణవము మొదలగు తంత్రములందుఁ గలవు.