పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

వేమన

ఒకటి రెండు పదములు మాత్రము భేదించిన పద్యములనేకములు గనుపట్టును. మఱియు ఒకటే పద్యమును వేఱువేఱుచోట్ల విన్నవారు మరలఁ జెప్పనప్పడు జ్ఞప్తి చక్కఁగ లేక, వేమన కవిత్వమునకు వారి పైత్యమును కొంతచేరి పాఠభేదములు గలుగును. ఇట్టి పద్యము లన్నియు, ప్రకృతము ముద్రించిన వారివలె, వేఱుగా లెక్కించుట యన్యాయము. వేమన 'పదియు నైదు వేల పద్యములను" చెప్పిసట్లు తానే చెOప్పికొనుట నిజమేని, ఆ సంఖ్య యిట్లే పదాక్షర భేదముచే పెరిగినదేని, ఆ కాలమున నతనికి వచ్చిన 'వెఱ్ఱి వేమన' యను బిరుదు సార్ధకమనుటకు నేఁడు నేనును వెనుదీయను ! సంఖ్య విషయమున మనవారికి ఊహ పాఱినట్లు మఱెవరికిని పాఱ దనుకొందును. రామాయణము మొదట వాల్మీకి వ్రాసినది శతకోటి గ్రంధం శుక్రనీతి శతలక్షలు! అంతయేల? మొన్నటి త్యాగరాజు వ్రాసిన కీర్తనలు ఇరువది నాల్గువేలు! ఇప్పటి రామాయణ సంఖ్య ! ఉన్న స్థితికిని ఊహకును ఎంతదూరమైన నంతసంతోషమేమో మసకు ! అది యట్లుండె, పదములకుఁ గల పాఠాంతరములు పద్యములకే రూపాంతరములుగా భావించుటచేత ఇప్పటి వేమన పద్యముల సంఖ్య యింతయైనది. అట్టివి ప్రోసివేసి వ్రాఁతప్రతులలోని యముద్రిత పద్యములను చేర్చుకొంటిమేనియు మూఁడు వేలకు మించునట్లు కానరాలేదు. వేమన్న నామము అజరామరముగా ఆంధ్రలోకమున నిలుచుటకు ఆయిన్ని పద్యములు చాలునను కొందము.


ఇకవీటిలో ప్రక్షిప్తములెన్ని ? ఈనిర్ణయమే కష్టతరము ; కాని యసాధ్యము గాదు. వేమనను వరించి వచ్చినది ఆటవెల(ది. ఆ పద్యములలో తొంబది పాళ్ళాతనివే యని శైలిసామ్యమునుబట్టి చెప్పవలసి యున్నది. ఇఁక నిప్పటి ముద్రిత ప్రతిలోని కందముల సంఖ్య 691 (వే. సూ. ర. చూడు). చెన్నపట్టణము ప్రాచ్యలిఖిత పుస్తకశాలలోనివి నుమారు ఏబది వ్రాఁతప్రతులను జూచితిని గాని వానిలో నెందును ఇన్ని లేవు. ముఖ్యముగా నొక వ్రాఁతప్రతిలో (ఓ. లై, no--11-9-25) వేమన కందములనే యెత్తి యొకచో వ్రాయఁ బ్రయత్నము చేయఁ బడినది. అందు 102 మాత్రము కందములుగలవు. అచ్చు ప్రతిలో 325 తేటగీతులున్నవి. (వే.సూ.ర.) కాని వ్రాఁత ప్రతులలో తేటగీతుల సంఖ్య చాల తక్కువ. బ్రౌనుదొర ప్రకటించిన సుమారు ఏడువందల పద్యములలో రెండే తేటగీతులు గలవు. అందులో నొకటి సీసగీతము ! ప్రాఁత యచ్చుప్రతులలోని యనేక తేటగీతుల మకుటము "విమలగుణ రాజయోగీంద్ర వేమనార్య' యని యుండును. కాని వ్రాఁతప్రతులలో నీమకుటముతోడి పద్యమే నేను జూచినట్లు జ్ఞప్తిలేదు. కావననే కా(బోలు బందరువారి ప్రతిలోను, దానినే పూర్తిగా ననుసరించిన వావిళ్ళవారి కడపటి ప్రతిలోను, పై మకుటమును పూర్తిగావదలి, ఆచోట అతికి యతకని ముక్కల నల్లి తేపవేసినారు ! వేమన తత్త్వ విచారములను ముఖ్యముగాఁ జెప్పటకు అప్పడపుడు కందములను గీతములను ఉపయోగించెనని యూహింప వీలున్నది గాని, బలమైన హేతువు లభించువఱకును, ఇప్పటి కందగీతులలో ననేకము లతనివి గావని నేను నమ్ముచున్నాను. ఇది గాక చంపకాది వృత్తములు కొన్ని యతని పేరనున్నవి. పాటల వంటివి కొన్ని గలవు. ఆందుఁగొన్ని వ్రాఁత ప్రతులలోనే యున్నవి. వాని నన్నిటిని వేమనవని నమ్మఁజాలను. ఈ క్రింది పద్యములు చూడుఁడు ---