పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరి కభిమానగ్రంథము. తెనుగువచనగ్రంథములలో చిన్నయ తర్వాత శ్రీతాతగారి కథాసరిత్సాగరము వీరికి కడుంబ్రియము. మైసూరులో నుండుకాలమున కథాసరిత్సాగరము, అన్ని భాగములను, రెండుప్రతులు, ఒకటి ఇంటను, రెండవది కళాశాలలోను ఉంచుకొనియుండువారు. విరామసమయములలో వీనిని చదువుచుండువారు.

ఇట్టి, మారెడ్డిగారు తమకు అనారోగ్యమైనను, కార్యాధిక్యముచే నవకాశము లేకున్నను, శ్రీ తాతగారియందలి భక్తి చేతను, నాయందలి వాత్సల్యముచేతను, 'గురుపూజ' యని పేరిడి, నాగ్రంథమును ప్రశంసించుటలో క్రొత్తయేమి! శ్రీ రెడ్డిగారికి నేను నిరంతరము కృతజ్ఞుడనే.

అల్పజ్ఞుడనైన నామాటలకు, బాలభాషితమునకుంబోలె, సంతసించుచు, నన్నీరచనకు పురికొల్పుచుండిన మా నెల్లూరి మిత్రులకెల్లరకును వందనములు.

వే.వేం.
25-12-43
మదరాసు.