పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

వారి ద్రవ్యార్జనకు ఈగ్రంథ మనుకూలించినట్లు కనబడలేదు. ఆ పెద్దలలో నొకరు ఈవ్రాతప్రతిని చేతనుంచుకొని 'అయ్యా, అంతాబాగున్నదిగాని, ఇందులో వాళ్లప్రశ్నలకు అన్నిటికీ సమాధానంలేదే.' అని ఆక్షేపించిరి.

వెంటనే శాస్త్రులవారు 'ఆపుస్తకం దయచేయండి' అని పుచ్చుకొనిరి. అందు వారు కాగితములను ఒకవైపుమాత్రమే వ్రాసియుండిరి. రెండవప్రక్క వ్రాతలేదు. 'తాము ఇటు చిత్తగించినప్పుడు లేదా?' అని వ్రాయనివైపుచూపి 'ఇటుచిత్తగించినప్పుడు లేదా?' అని వ్రాసినవైపుచూపినారు. ఆపెద్దలు ఏమి చెప్పుటకును తోచక మొగాలు చూచుకొనిరి.

శాస్త్రులవారు: 'కనుక పూర్తిగా చదివిచెప్పండి. ఒక కాగితం తిరగవెయ్యగానే మీకు విషయమంతా కనబడదు.' అని చెప్పినారు.

ఆపెద్దలు ఇంకొకసాకువెదకుచు 'ఈపుస్తకం చాలా పెద్దదిగా ఉందండి. కొంచెము సంగ్రహించి వ్రాస్తే బాగుంటుంది' అనిరి.

శాస్త్రు: ఆహా, అని ఇంటికిపోయి చిన్ననోటుబుక్కులో సన్న యక్షరములలో వ్రాసి, ఇకనిన్ని విషయములుచేర్చి, మరల ఆ పెద్దలకిచ్చినారు. వారు చూచి 'ఆహా! ఇప్పుడు సరిగా ఉందండి.' అనిపలికినారు. ఇట్లుందురు గుణగ్రహణపారీణులు.

ఈ విధవావివాహవాదముల సందర్భమున శాస్త్రులవారికి చాల ప్రసిద్ధియేర్పడినది. ఆంధ్రదేశమందేకాక ద్రవిడ