పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

తరగతిలో నన్ను వేయగానే క్షణములో నేనే మొదటివాడనగుదును. మఱి నాతావు తప్పింప నొరుల తరముగాదు. నాకు ఒకమాఱుచెప్పిన చాలును, ఒకమాఱు చదివిన వచ్చును. నాకు సులువుగ రానిది గణితము, కుదురనిది చేతివ్రాత. నేను దెబ్బలెఱుగను. అబద్ధము చెప్పను. సాలాఖరుపరీక్షలో నాకు పుస్తక బహుమానము, For General Proficiency అనివ్రాసి యిచ్చినారు.

ఉపనయనానంతరము - తాతగారు సంథ్యావందనము చెప్పుట నేను నోటచెప్పుచు చేతులతో సంథ్యోదకమును కాలువలు పాఱించుట...రేవువారి యింట నొకపంతులు సర్కారుద్యోగస్థుడు. పేరు కస్తూరివారు. తద్భార్య శేషమ్మ. ఆమె సంస్కృతమున విదుషి. ప్రతిదినము రాత్రి మానాయనగారి భోజనసమయమున వచ్చి వారితో సంభాషించుచుండును. తద్భర్త ఆమెను మానాయనగారితో ఇట్లు విద్యావ్యాసంగము సేయుటకు ఆక్షేపింపక పైగా సంతోషించుట."

శాస్త్రిగారు రాజమండ్రిలో నుండగా మితిమీరి బోటుషికారులు పోవువారు. ఒక్కొకప్పుడు రాత్రులు సయితము ఇంటికిరాకయే తిరుగువారట. వీరికి వీరితమ్ములు వేంకటసుబ్బయ్యగారు నిరంతరముతోడు. వారికిని శాస్త్రులవారికిని వయసున ఎక్కుడుభేదము లేదు. ఒకమారు వీరిరువురును కొందఱు స్నేహితులతో గోదావరిలో ఈత పందెములు వేసికొని ఆవలిగట్టునకు ఈదసాగిరి. కొంతదూర మీదు నప్పటికి