పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1914 నవంబరు 18 తారీఖు-నెల్లూరు, మూలపేటలో నివాసము.
1915 డిసంబరు-సూర్యరాయాంధ్ర నిఘంటుసంపాదకత్వ ప్రాంభము.
     అందులకై మదరాసు కాపురము
1916 బొబ్బిలియుద్ధ నాటకప్రకటనము.
     శ్రీ వేంకటగిరిమహారాజా గోపాలకృష్ణయాచేంద్రులవారి మరణము
1918 పిబ్రవరి నిఘంటువుతో సంబంధము వీడిపోవుట
1919 జ్యోతిష్మతీవిక్రయము
     మాళవికాగ్ని మిత్రనాటకము.
     మహోపాధ్యాయబిరుదము, రు 1116. బహుమానము
     ఆంధ్రసాహిత్యపరిషదధ్యక్షత్వము.
1920 విమర్శవినోదప్రకటనము
     తిక్కనసోమయాజివిజయము-తిక్కనవర్ధంత్యుపన్యాసము.
     ఉత్తరరామచరిత్రనాటకాంధ్రీకరణము.
     ఆముక్తమాల్యదవ్యాఖ్య తే 24-6-1920 నాడు ప్రారంభించి
     తే 28-10-1920 నాటికి పూర్తిగావించిరి.
1921 విక్రమోర్వశీయము
     రత్నావళీనాటిక
     సాహిత్యదర్పణమును ఆంధ్రీకరించుటకు పిబ్రవరి 2 తారీఖున ప్రారం
     భించి ఏప్రిలునెల 11 తారీఖునాటికి పూర్తిగావించిరి.
     ఆంధ్రహితోపదేశచంపువు
1922 జనవరి-నేటివిండ్సరుప్రభువు, వేల్సుయువరాజుగా మనదేశముంకు
     వచ్చినప్పుడు మదరాసులో సన్మానము చేయుట.
     మరల నెల్లూరుకాపురము