పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అచ్చాపీసును విక్రయించుట కిష్టములేకపోయినను తప్పని సరి యైనందున విక్రయించిరి. విక్రయించిన ప్రథమమున చింతాకులులై యుండిరి. కాని వెనుక కొంతమనశ్శాంతి చేకూరినది. జోరువర్షముకురిసి వెలిసినట్లైనది. శృంగారనైషధము వెలువడినప్పుడే 'చేసెదనింక దత్పరతసేవలు చూడికుడుత్తదేవికిన్‌' అని వ్రాసియుండిరి. తాతగారు మరల నద్దానిని ప్రారంభించి కృషి సలుపసాగిరి. శ్రీ పిఠాపురము మహారాజావారు ఒక జాబులో నిట్లు వ్రాయించిరి:-

About Amukta - Malyada the Rajah wants me to write to you to say that he would like to have it just like your విజయవిలాసం in size (if possible even a little smaller), type and get up. If necessary he says it may be split up into two volumes, Naishadha, he considers to be very ponderous and unwieldy. He would be glad know your views.

తాతగా రిట్లువ్రాసినారు. "వ్యాఖ్య ఈపాటి విపులమగునని ఆదిలో నేను ఊహించుకొనలేదు. రెండాశ్వాసములకు వ్రాసిచూడగా, బావిత్రవ్వగా బేతాళములు వెలువడినట్టులయినది. గ్రంథనకెల్ల జీర్ణోద్ధారమే కావలసివచ్చినది. అందులకై సమగ్రసంస్కరణ - సాధుపాఠనిర్ధారణ - కువ్యాఖ్యా విషహరణ - సమంజసార్థావిష్కరణపూర్వక విపులవ్యాఖ్యానమును వ్రాయ నుద్యమించితిని."