పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18-ప్రకరణము

శృంగారనైషధవ్యాఖ్య - శ్రీ రేబాల లక్ష్మీనరసారెడ్డిగారు

శ్రీ శాస్త్రులవారు అచ్చాపీసు ప్రారంభించినప్పుడే ఆముక్తమాల్యదకు వ్యాఖ్య వ్రాయసంకల్పించి తమ ప్రచురణముల జాబితాలో నియ్యది సిద్ధమగుచున్నదని ప్రకటించిరి. కాని యందులకు విశేష గ్రంథావలోకనము వలసియుండినందున అదివచ్చులోపల నైషధమునకు వ్యాఖ్యవ్రాయుట సులువని దానిని ప్రారంభించి కృషి సలుపసాగిరి. శృంగారనైషధ ముద్రణోపోద్ఘాతమున శాస్త్రులవా రిట్లువ్రాసినారు. "ఈవ్యాఖ్యను రచించుటకై పూర్వముద్రణములో ఇంచుమించుగా 2000 తప్పులను దిద్దవలసివచ్చినది. అందు రమారమి 1100 అనుబంధమున సూచించి యున్నాడను. దిద్దుటకు ఊహయు సంస్కృతమూలంబును అలవడిన తాళపత్ర పుస్తకంబులును కావ్యాంతర సంవాదాదికంబులును సాధనములు. వ్యాఖ్యరచియించుటకన్న పాఠనిర్ణయము చేసికొనుట కడునెక్కుడుపనియైనది. పెద్దలకు పరితోషార్థమును పరీక్షార్థమును విద్యార్థులకు బోధనార్థమును సవరణలకెల్ల ఉపపత్తిని చూపితిని. అంతియగాక ఎల్లవారును తమతమ యిచ్చమెయి పాఠస్వీకరణము చేసికొందురుగాక యని పూర్వపాఠములను అచ్చుదప్పులని నాతలచినవానిని సయితము వ్యాఖ్యలోను అనుబంధములలోను చూసినాడను." అని*


  • వేంకటరాయశాస్త్రులవారు ప్రాచీనగ్రంథములను సవరించుటలో ననుసరించిన పద్ధతులంగూర్చి ప్రత్యేక మొకగ్రంథము వ్రాయుటకవకాశము గలదు.