ప్రాతర్భజామి మనసా వచసా మగమ్యమ్
వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ |
యన్నేతి నేతి వచనైర్నిగమా అవోచమ్
తం దేవ దేవ మజ మచ్యుత మాహురగ్ర్యమ్ ॥
ప్రాతర్న మామి తమసః పరమార్క వర్ణం
పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యమ్ |
యస్మిన్నిదం జగదశేష మశేషమూర్తి
రజ్వాం భుజంగ ఇవ ప్రతిభాసితం పై ॥
అన్న ప్రాతఃస్మరణ శ్లోకాలను పఠిస్తాడు. పైన చెప్పిన శ్లోకాలలోని అర్థాన్నీ
'కాలః కలయతే లోకం
కాలః కలయతే జగత్ |
కాలః కలయతే విశ్వం
తేవ కాలోభిషీయతే ॥
కాలస్య వశిగా స్సర్వే
దేవర్షి సిద్ధ కిన్నరాః |
కాలోహి భగవాన్ దేవ
స్స సాక్షాత్పరమేశ్వరః ॥'
అన్న కాలస్వరూపాన్ని నిరూపించి కాలం పరమాత్మ అనీ, సర్వం కాలాధీనమని
ఊహించి మననం చేసుకుంటాడు. కాల్యకృత్యాలను తీర్చుకొన్న తరువాత
మంగళస్నానం చేసినా, సంకల్పపూర్వకమైన కూపోదక స్నానాన్ని గానీ, నదీ జలోదక
స్నానం గానీ చేసి సంధ్యావందనం పితృతర్పణాదులు పూర్తి చేసి, దేవతలకు పులికాపు
చేసి అసాదించి శర్క రామ్ల ఘృతాదులతో కూడిన నింబ కుసుమ ప్రసాదాన్ని నివేదన
చేసి, సకుటుంబంగా తానూ స్వీకరిస్తాడు. మృష్టాన్న భోజనం చేస్తాడు. సాయంత్రం
పంచాంగ శ్రవణం చేస్తాడు.
ధనికులు కొందరు దైవజ్ఞులను, పండితులను, గురువులనూ ఆహ్వానించి వాళ్ళ
ఇళ్ళల్లోనే సాయంత్రం పంచాంగ శ్రవణం చేస్తారు. వీరికీ, గ్రామ వాసులకూ ఉదయమే
ఇంటి పురోహితులూ, గ్రామ పురోహితులూ వచ్చి నింబకుసుమ ప్రసాదాన్ని ఇచ్చి
వెళ్ళుతారు.
378
వావిలాల సోమయాజులు సాహిత్యం-4