Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

15

భాస్కరాచార్యులు (క్రీ.శ. 1150) దినాన్ని త్రుటుల లెక్కలో చెప్పి, దినానికి 2,91,60,00,000 త్రుటులున్నవన్నాడు. అంటే 27x25x43,20,000 చతుర్యుగాలను సంవత్సరాలుగా మారిస్తే ఎన్ని భాగాలు వస్తవో, దినాన్ని భాగాలుగా మారిస్తే అన్ని త్రుటులు వస్తవన్నమాట.
ఒక మధ్యాహ్నం నుంచి మరొక మధ్యాహ్నానికి సూర్యుడు రావటానికి పట్టే కాలాన్ని సౌరదినమని వ్యవహరిస్తున్నాము. ఈ సౌరదిన పరిమాణం ఋతువులతో బాటు మారుతూ ఉంటుంది. దీర్ఘమైన ప్రొద్దున్న దినానికీ, పొట్టి ప్రొద్దు ఉన్న దినానికీ మధ్య తేడా 51 సెకండ్లు. దినానికి ఆరంభం లంకిలో ఉయమని ఆర్యభటుడు, వరాహ మిహిరుడు అర్ధరాత్రం నుంచి అర్ధరాత్రానికి దినమని చెప్పాడు. 'ఉదయా దుదయం వారః' అన్న ప్రమాణాన్ని అనుసరించి మనం నిత్య వ్యవహారంలో ఉదయంతోనే దినం ఆరంభించినట్లు లెక్కిస్తున్నాము.
దినంలో (పగటిలో) ప్రాహము, మధ్యాహ్నము, అపరాహము, సాయాహము' అని నాలుగు రీతులు ఒకచోట, ఉష, మధ్యాహ్నము, అపరాహము, సాయాహము, సంగవము (పాలు పితుకు కాలము) అని ఒకచోట అయిదు రీతుల కన్పిస్తున్నది. బౌద్ధుల పద్ధతిని బట్టి రాత్రి త్రియామ, యామానికి నాలుగు గంటలు. బౌద్ధేతరులు రాత్రిని, పగలును కూడా నాల్గు యామాల క్రింద విభజించి వ్యవహరించినట్లు యువాన్ చ్వాంగ్ చెప్పినాడు (యువాన్ చ్యాంగ్ పుట 143)

16

ప్రాచీన కాలంలో దినప్రమాణాన్ని, సహగమన విశేషాలనూ క్రమంగా నిరూపించుకొని వ్యవహరించుకోటానికి కొన్ని యంత్రా లుపయోగించారు. ఋగ్వేదంలో తురీయమనే యంత్రం కనిపిస్తున్నది.

దీనిని భాస్కరాచార్యులవారు 'దళీకృతం చక్రముశంత చాపం కోదండ ఖండం ఖలు తుర్యగోళం' (సిద్ధాంత శిరోమణి -10-15) అని వర్ణించారు. ఒక గ్రహాన్ని గాని, నక్షత్రాన్ని గాని, సూర్య చంద్ర బింబాన్ని గాని మనం చూస్తున్నప్పుడు అది దిక్చక్రం మీద ఎన్నో భాగ (డిగ్రీ) ఎత్తున ఉన్నదీ దాని సహాయంతో మనవారు చూచేవారు.31 వృత్తాంత పరిమాణాన్ని, కాల పరిమాణాన్నీ కనుక్కోవటానికి పూర్వులు రెండు యంత్రాలను ఉపయోగించారు. శంకువు పగటివేళ పనిచేస్తుంది. రాత్రికి కపాల యంత్రాన్ని కనిపెట్టారు. రాశిచక్రం వచ్చిన తరువాత సూర్య ఘటికాయంత్రం సంస్కృతి 375