వాత్స్యాయనుడు - కామసూత్రములు
చతుర్విధ పురుషార్థములలో కామము తృతీయము. పరలోక సాధకమైనది ధర్మము. ఇహలోక సాధకమైనది కామము. మతిమంతులై మెలగినవారికి కామమును మోక్షసాధకమే అగునని 'ధర్మావిరుద్ధో లోకేస్మిన్ కామోస్మి భరతవర్షభ' అను గీతావచనమును బట్టి వ్యక్తమగుచున్నది. సర్వేంద్రియ తోషకమైన కామము సర్వార్థ సాధకమగుటచే దీనిని పరమ పురుషార్థముగ పరిగణించి, మహర్షి వాత్స్యాయనుడు 'ధర్మార్థ కామేభ్యో నమః' అని మంగళారంభమును పలికినాడు. త్రివర్గములందును ధర్మార్థములు పురుషార్థములని సూచించుటకే మున్ముందు అట్లు వచించినాడుగాని కేవలమగు పరమపురుషార్థము కామమే అని వాత్స్యాయనుని అభిప్రాయమై నట్లు నరసింహవృత్తి పలుకుచున్నది.
'పునీత భారతమున సమస్త తేజమును శ్వేతరక్తవర్ణ జలబిందు ద్వయమున
నున్నది. ఈ రెంటిలో శ్వేతము పురుషకము, రక్తము స్త్రైణము, ఇవి భిన్నాభిన్నములు.
కామదేవతా విధ్ధములు. అందువలన కామము సృష్టి సమస్తమును బంధించు
అంతరికశక్తి. కాని అది శక్తిశేఖరము కాదు. ఈ బిందుద్వయ సంయోగ వియోగములకు
కారణభూతమైన పరమశక్తి కామాధిదేవత కంటె గొప్పది. స్త్రీ పురుష లింగద్వయ
సంయోగమువలన కామకళాదేవి రూపకల్పన మొందినది. సూర్యచంద్రములు ఆ
దేవత పయోధరములు. ఆమె సృజనేంద్రియములు హార్ధకళాయుతములు. వారి
కామకథనమును గురించియు, జగదుత్పత్తి, స్థితిలయములను, తార్తీయ పురుషార్థ
స్థానమును గురించియు ఒక వృద్ధ భారతీయవేత్త నాతో పలికినాడు' అని 'గోల్డు
బెర్గు’ పండితుడు అతని పవిత్రాగ్ని (Sacred Fire) అను గ్రంథమున వ్రాసి ఉన్నాడు. '
ఇట్టి మహోన్నత దృష్టితోను, పరిపూర్ణ జ్ఞానమును కామమును ఉపాసించిన జాతి
మరెచ్చటను లేదని చెప్పజూచుట అతిశయోక్తి కాజాలదు.
ప్రాచీన భారతీయుల కామతంత్ర లోలతకు ప్రధాన కారణము ప్రజ.
గృహమేధులగుట సంతానము కొరకే. ప్రజాతంతు విచ్ఛేదము జరుగకుండునట్లు
జూచుటకే కామకళా విజ్ఞాన మత్యావశ్యకముగ వారు పరిగణించిరి. ఏతద్విజ్ఞాన
109