కాలికిగట్టిన త్రాడు కనిపించినది. దంత కాష్ఠముల కుపయోగించు కత్తితో దానిని తెంపినాడు.
ఏకశృంగుడు, విజితావి - యిరువురు మిగిలిన త్రాటి ముక్కతో ద్వారదేశమున వెల్లికిలబడినారు. లేచివచ్చి చూచువేళకు ధ్వజకేతువు 'పశుబంధనము' నుండి అమితాభుని విప్పి తప్పించినాడు.
అదుష్టులిరువురు నంతటితో బోలేదు. ధ్వజకేతువును బెదరింపదలచి లోపలికి వచ్చినారు.
"ఏమిటా దుష్టచేష్ట! విద్యాలయములో మీ వంటి మూర్ఖులుండుటకు వీలులేదు. మీ చరిత్ర సమస్తమును మా పృథువులకు దెలిసినది. మీ సంగతిని త్వరలో తేల్చెదము” అని ధ్వజకేతువు వారితో ననినాడు.
వారిరువురు నతనిని రూక్షముగ జూచి "జాగ్రత్త” యన్నట్లు సంజ్ఞ యొనర్చినారు. ధ్వజకేతువు రౌద్రమూర్తియై "దుష్టులారా! ఇక తొలగిపొం'డని కేక బెట్టినాడు.
నిదురమత్తు గొంతుకతో 'ఏమదిధ్వజకేతూ!' అని యుత్సలుఁడు లేచివచ్చినాడు. 'ఈదుష్టులిరువురు నమాయకుని జేసి మన యమితాభుని పశుబంధన మొనర్చినారు. 'సిగ్గు సిగ్గు - పశుబంధనమా?'
'ఈవిషయమును బయటపెట్టిన మీ మువ్వుర ప్రాణములును దక్కవు', అని ఏకశృంగుడు బెదరించినాడు. విజితావి హస్త సంజ్ఞతో నామాటకు దాళము వేసినాడు.
"మే మూరక బోనిచ్చువారము కాము. నిరర్ధకముగ నొక సోదర విద్యార్థి నిట్లేడ్పించుట కంటె మరియొక క్రీడ మీ కేమియును గన్పింపలేదా? మీరు పశు వులు”.
"ఛీ! నోరుమూయుము. ఆ శిఖి వెధవ మీ యరజేతికి పండ్లు పెట్టినాడు. ఇప్పుడు మీపై చేయిజేసుకొనిన గ్రుద్దుకు జాలరు. మీయబ్బ యెవడడము వచ్చునో కాచుకొనుడు" ఏకశృంగుడు విసరిన పాదరక్ష ఉత్పలుని గుండెపై దాకి క్రిందబడినది. అతడు ముందుకు వచ్చినాడు. ధ్వజకేతువు 'వానియొంటిపై దెబ్బపడిన 'నీ వప' యొలిపించెద ననినాడు.
ఇప్పుడు రభస పెట్టుకొనిన జిక్కుకపోవుడు మను భయముతో ఏకశృంగ విజితావులు 'రేపు మీపని బట్టింతు' మని సర్దుకొని పోయినారు. కేతుధ్వజుఁడు గజగజ