లే”దని. “మత్తుపదార్థమా? - వారికెట్లు లభించినది?” “నాలందలో ఫలము లమ్ము నెపమున వచ్చి కొందఱుబేరగాళ్ళు వారికి వెచ్చిపెట్టుచుందురు.” “ఇట్టివి చెడ్డ యలవాట్లని నీవు వారితోనన లేదా?”
'లేదు, భయపడియేమియు ననలేకపోయినా'నని సిగ్గుతో అమితాభుడు తల వంచుకొనినాడు.
'అట్టి దుష్టకృత్యముల మనమేనాడైనా నెదిరింపవలయును'. "బలవంతుడవు నీవేమైనా యొనరింపగలవు. - ఉపాధ్యాయుల కివన్నియును దెలియవు.” “తెలియజెప్పిన నేమగును?"
“ప్రాణములపై నాశ వదలుకొనిన గాని యిట్టిపని జేయరాదు." "పొరబాటు పడుచున్నావు. ఏకశృంగుడు, విజితావి, సుధన్వాదులు నీవలెనే బలహీనులుగను, ధైర్యరహితులుగ నిచ్చుటకు వచ్చినారు. వెరగు పడుకుము. ముందెన్నడైన వారట్టి దుష్టక్రియలకు బూనుకొనిన వ్యతిరేకింపుము. బలవంతపెట్టిన ధైర్యము వహించి తిరుగబడు"మని చెప్పి శాతకర్ణి అమితాభునిచే బ్రమాణము చేయించుకొనినాడు.
ఉత్తమ శీలుర కళ్ళయెదుట నాలందలో నిట్టి దుష్కృత్యములు సాగిపోవుట కతడిష్టపడలేదు. అమితాభునెట్లైన వారి బారినుండి తప్పించి యీపవిత్రభూమిలో దుష్కృత్యములు సమస్తమును ధ్వజకేతువు, మంగళుల వంటి మిత్రుల సహాయముతో మాన్పింపవలెనని శాతకర్ణి కృతనిశ్చయుడైనాడు.
ఇరువురును మఱల వారికక్ష్యల జేరుకొనునప్పుడు శాతకర్ణి 'అమితాభా! దుష్టుల బారినుండి దూరునొనర్చి రక్షింప భగవానుని బ్రార్థింపు'మని జెప్పి యతనిని పంపించినాడు. అతని కష్టముల జెప్పుకొని హృదయభారమును దీర్చుకొన నొక యాప్తమిత్రుడు దొరికినాడను సంతోషముతో నమితాభుడు కళకళలాడుచు కక్ష్యను బ్రవేశించినాడు.
7
సంవత్సరాంతము కొలది కాలములోనున్నది. విద్యార్థులకు శబ్దవిద్య పూర్తియైనది. కావ్య పాఠములు స్వల్పముగ మిగిలినవి. జాతకకథాగుచ్ఛము పూర్తి కావచ్చుచున్నది. 'న్యాయద్వార తర్కము'న గావలసిన భాగములైనవి. విద్యార్థులు పరీక్షలకు శ్రమించి జదువుచున్నారు.