Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/721

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గఠినమొనర్చుకొని శిక్ష ననుభవించినాడు. ఉపాధ్యాయునిపై దనకు నిరసనభావ మధిక మైనట్లు వ్యక్తపరచినాడు. గయాశీర్హుడు దానిని గమనించినాడు.

మధ్యాహ్నవేళ నుపాధ్యాయ మందిరమున గయా శీర్షుడాలోచనా పరవశుడై యొంటిగ గూర్చొనియున్నాడు. ఆయన యుపాధ్యాయ జీవితమున మున్నెన్నడు నట్టిక్లిష్టస్థితి యేర్పడలేదు. 'ఏమో యోచించుచున్నారని సమోపాధ్యాయుడమృతవర్షుడు ప్రశ్నించినాడు.

"ఈదిన ముదయము, నూతన విద్యార్థి, శాతకర్ణికి శిక్షజెప్పినాను. అందువలన నతనిలో మార్పేమియును గలుగలేదు నాపై నిరసనభావ మధికమైనది. అందువలన నేను కలత పడుచున్నాను.”

"ఖగోళ పాఠముల నతడు నాయెద్ద చదువుచున్నాడు, ప్రవేశించినది మొదలు నాకు నతనికి శిక్షజెప్పని దినములే”దని అమృతవర్షుడనినాడు.

"అతని యవినయము నాకు నచ్చలేదు. శిక్షించినను బ్రయోజనము పొడకట్టదు. అయిననూ నతడు తెలివిగలవాడు.

కాశ్యపుడు దూరమునుండి యాయుపాధ్యాయుల సంభాషణమును విని మృదువుగ నిట్లనినాడు:

"ఆ బాలుని గురించి మీరిరువురును దురభిప్రాయ పడుచున్నారు. అతడనిన నాకు విశేషాభిమానము. విద్యాబుద్ధులలో మన యుత్తమ విద్యార్థులలో నతడెవ్వరికిని దీసిపోవువాడు కాడు. అతని వినయగౌరవము లితరులకు లేవని నా నిశ్చయము, వినయపిటక పాఠముల బౌద్ధసంప్రదాయకములైన నీతిపాఠములకై నా యొద్దకు వచ్చినప్పుడతనిని గమనించినాను. అతని కాత్మవిశ్వాస మధికము. ఇంచుక దయానురాగములతో నతని వశమొనర్చుకొన నేను మిమ్ము ప్రార్థించుచున్నాను.”

"అతనిని నేనెన్నడును నిర్దయతో జూడలేదని గయా శీర్షుడనినాడు. "నేను నతనియెడ ననురాగమునే బ్రకటించినా”నని అమృతవర్షుడు పలికినాడు.

“అయిన నతనికై మీ విద్యావిధానమును గొంత మార్చి చూడుడు" అని ఆచార్య కాశ్యపు డభిప్రాయమిచ్చెను.

“మా విధానమును నతనికొరకు మార్చుట కవకాశముండ”దని నా రేకగ్రీవముగ బలికినారు.