Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

“ఇప్పటికీ దుశ్చర్యలను చేశానని నేను అంగీకరించదలచుకోలేదు గనక, అప్రతిష్టాకరాలైన కృత్యాలనిన్నటినీ వివరించే ఉద్దేశం నాకు లేదు. అయితే ఎట్టి హెచ్చరికలు వచ్చి ఏ క్రమసంఘటనలతో నేను శిక్షను అనుభవించివలసి వచ్చిందో మాత్రం, వివరింపదలిచాను. ఒకమారు ఎటువంటి పర్యవసానమూ కలగని ఒక ప్రమాదసంఘటన జరిగింది. దాన్ని నేను కేవలం సూచించి వదిలేస్తాను. ఒక బాలిక విషయంలో నేను క్రూరప్రవర్తనను ప్రకటించినప్పుడు దారినపోతున్న ఒక వ్యక్తికి నా మీద పట్టరాని కోపం వచ్చింది. అతడు మీ జ్ఞాతి ఎన్ఫీల్డు అని మొన్ననే తెలుసుకున్నాను. అతనితో వైద్యుడూ, ఆ బాలిక బంధువులకూ చేరారు. అప్పుడు నా జీవితానికి ప్రమాదం సంభవిస్తుందేమో అన్నంతగా భయపడ్డ క్షణాలు కలిగినవి. అందువల్ల ఉచితమైన వారి కోపావేశాన్ని శాంతింపజేయటానికి హైడ్ వారిని ద్వారబంధం దగ్గిరికి తీసుకోపోయి జెకిల్ సంతకంతో ఒక చెక్కును ముట్టచెప్పవలసి వచ్చింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు సంభవిస్తే కాచుకోటానికి, మరొక బ్యాంకులో ఎడ్వర్టు హైడ్ పేరనే ఒక పద్దు ఏర్పాటు చేశాను. నా చేతి ఖత్తు ఏటవాలుగా వంచి వ్రాసి నా రెండోమూర్తికి ఒక సంతకాన్ని సృష్టించాను. ఇందుమూలంగా నేను విధి అందుకు దూరంగా తిష్ఠ వేయగలనని ఊహించాను.

సర్ డాన్వర్సు హత్యకు రెండు నెలల పూర్వం నేను నా నిత్యసాహస విహారాలకు వెళ్ళి ప్రొద్దుపోయి తిరిగి వస్తున్నాను. మరునాటి ఉదయం శయ్యమీదినుంచి లేచేటప్పటికి నా కేదో విచిత్రస్పృహ కలిగింది. చుట్టుపట్ల చూచుకొన్నాను. చౌకులోని నా ఇంట్లో ఉన్న రమణీయమైన దారులోహాది సామగ్రులను పరికించాను. ప్రయోజనం లేకపోయింది. నా శయనీయయవనికల మీద అల్లికలను, చండ్రకొయ్యతో చేసిన చట్రాన్ని చూచాను. నేనెక్కడున్నానో గుర్తుపట్టగలిగాను. అయితే ఉండవలసిన ప్రదేశంలో లేనట్లు నాకు విస్పష్టంగా తెలిసిపోయింది. హైడ్ రూపంతో ఉండేటప్పుడు సోహోచాకులోని ఏ కక్ష్యలో నిద్రపోవటానికి నేను అలవాటు పడ్డానో ఆ గదిలో నిద్రించిన నేను అక్కడ మేల్కోలేదని గ్రహించాను. ఆత్మవిమర్శ సాగించాను. నాలో నేనే నవ్వుకున్నాను. ఇటువంటి విభ్రాంతి నాకెందుకు కల్గింది అని విమర్శించుకుంటూ ఏదో మత్తుగా కూర్చున్నాను. నాకిటువంటి జిజ్ఞాసావస్థ సంభవించి నప్పుడు, తెల్లవారిన తరువాత కూడా కునికిపాట్లు పడుతూ మత్తుగా ఉండటం ఆచారం. అప్పుడు ఇంకా అటువంటి మాంద్యంలోనే ఉండగా, నాకు కొంతగా జాగ్రదావస్థ కలిగింది. ఎందుకో నా చూపు చేతిమీద పడింది. (మీరు అనేకపర్యాయాలు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు