Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/530

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మరుక్షణంలోనే స్వాధీనానికి వచ్చిన కంఠస్వరంతో "మీ దగ్గర కొలత గ్లాసు ఉందా?” అని అతడు ప్రశ్నించాడు.

"కొంత ప్రయాసపడి లేచి అతడు అడిగిన వస్తువును తెచ్చి ఇచ్చాను.

"చిరునవ్వుతో తల ఊపుతూ నాకు అతడు కృతజ్ఞతను వెలిబుచ్చాడు. ఎర్రని అరఖులోనుంచి కొలతగా కొన్ని చుక్కలు గ్లాసులో వేసి, దానిలో ఒక చూర్ణాన్ని కలిపాడు. ఆ మిశ్రమం రంగు మొదట ఎర్రగానే ఉంది. అందులో వేసిన స్ఫటికాలు కరుగుతున్నకొద్దీ అతికాంతిమంతమౌతున్నది. క్రమంగా ఆ మిశ్రమం పొంగి నురగమీది తుంపురులు ఎగిరిపడుతున్నవి. కొంతసేపటికి పొంగు ఆగింది. తరువాత ఆ మిశ్రమం రంగు ఊదాగా మారింది. ఆ రంగు కూడా క్రమంగా విరిసి లేత ఆకుపచ్చరంగుగా మారింది. ఆ ఆగంతుకుడు కలిగే ఈ మార్పుల నన్నిటినీ అతిశ్రద్ధతో గమనిస్తూ, తుదకు ఒక చిరునవ్వు నవ్వి గ్లాసును బల్లమీద పెట్టాడు. నా వైపు తిరిగి నన్ను పరికించి చూచాడు.

“ఇకముందు జరగవలసినదానికి వస్తాను" అని అతడన్నాడు. "మీరు వివేకం వహిస్తారా? క్రమపద్ధతిని అనుసరిస్తారా? ఎటువంటి ప్రసంగం చేయకుండా ఈ గ్లాసును నా వెంట తీసికోపోనిస్తారా? లేకపోతే ఇదంతా ఏమిటో తెలుసుకుందామన్న కుతూహలం మిమ్మల్ని వెన్నాడుతున్నదా? మీరే నిర్ణయం చేస్తే అలా జరుగుతుంది కనుక బాగా ఆలోచించి నిర్ణయించండి. మీరు ఉన్నట్లే ఉంటే మీలో కలిగే మార్పు ఏమీ ఉండదు. మీకు ధనం చేకూరదు విజ్ఞానం పెరగదు. కానీ ఒక దుఃస్థితిలో ఉన్న మిత్రుడికి సహాయం చేయటమనే సంతృప్తి కలుగుతుంది. లేదా మీరు తెలుసుకోవలెననే నిర్ణయిస్తే మీ కోసం ఒక నూతన విజ్ఞానరాజ్యాన్ని, కీర్త్యధికారాలకు నిలయమైన నవ్యమార్గాన్ని తత్క్షణమే, మీ ముందే, ఈ గదిలో నేను ప్రదర్శించి చూపిస్తాను. సైతాను నాస్తికత్వాన్ని కూడా పారద్రోలగల మహాద్భుత ప్రతిభాసంపన్నుని మూలంగా మీరు దిగ్భ్రామ పొంది తీరుతారు!" అన్నాడు.

“ఆ సమయంలో నాలో నిజంగా లేని నిబ్బరాన్ని ప్రదర్శిస్తూ "అయ్యా! మీరన్నీ ఏవో చిత్రవిచిత్రాలు సెలవిస్తున్నారు. మీరు చెప్పే విషయాలమీద, కేవలం వినటం వల్ల, నాకు గాఢవిశ్వాసం కలగటం లేదంటే మీరు ఆశ్చర్య పడరనుకుంటాను. మీరేదో నేను పరోపకారాన్ని చేశానంటున్నారు. అది ఎలా చేశానో నాకేమీ బోధపడటం