Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాడి కూడా నీరసించినట్లు వ్యక్తమైంది. ఆ వ్యక్తికి అరోచకాన్ని కల్పించిన కొన్ని సందర్భాలు కారణంగా అతనికి ఉన్మాదం కలిగిందని నేను అప్పుడు ఊహించాను. అయితే అతనిలో ఆ ఉన్మాదలక్షణాలు అంత తీవ్రంగా పనిచేస్తున్నందుకు ఎంతో వింత పడ్డాను. అప్పటినుంచీ కేవలం ఒక రోతగాని, విద్వేషంగాని ఇంతటి శారీరక పరివర్తనను తీసుకోరాలేదనీ, అయితే దీనికి కారణం ఏదో అతని ప్రకృతిలోనే గూఢంగా జనించి ఉందనీ నేను భావించటానికి, భావించినదాన్ని విశ్వసించటానికీ, తగ్గ కారణాలు కన్పించాయి.

  • (ప్రవేశించిన మొదటి క్షణంనుంచీ నాలో అసహ్యకరమైన ఆసక్తిని ప్రేరేపించాడని

వర్ణింపగల) ఆ వ్యక్తి సామాన్యులకు నవ్వు పుట్టించే దుస్తులు ధరించాడు. అవి చాలా విలువైనవీ, హుందాతనం గల గుడ్డతో తయారైనవీ అయినప్పటికీ, ప్రతి కొలతలోనూ అవి అతని శరీరానికి చాలా పెద్దవి. అతడు తొడిగిన లాగూ ఎంతో పొడుగ్గా ఉండి, పాదాలమీద వ్రేలాడుతూ, నేలమీద జీరాడకుండా వెనక్కు మడిచి ఉంది. అతడు ధరించిన కోటు పిరుదులు దాటి ఇంకా క్రిందికుంది. మెడపట్టీ భుజాల క్రిందిదాకా వచ్చింది. అతడు ఇటువంటి పరిహాసాస్పదమైన వేషంలో ఉన్నా నాకు నవ్వు కలగకపోవటం, అన్నిటికంటే అతివిచిత్రమైన విషయం. నా ఎదుట నిల్చిన - ముట్టడి చేసే, ఆశ్చర్యకరమైన విప్లవాన్ని ప్రేరేపించే - వ్యక్తికి ప్రకృతి తత్త్వంలోనే వికృతి ఉండటం వల్ల, ఆ వికృతి మనస్సును కలవరపెట్టి రోత కలిగించేది కావటం వల్లా, అతడు ధరించిన దుస్తులవల్ల కలిగే వికారం అందులో అంతర్భాగంగానే నాకు గోచరించి ఉంటుంది. అతని ప్రవృత్తి, కథావిశేషాలూ, ఆస్తిపాస్తులూ తెలుసుకోవలెననే కుతూహలం కూడా నాకు కలిగింది.

“వ్రాయటం కావటంచేత ఇంత దీర్ఘంగా చెప్పిన ఇవన్నీ, అప్పుడు నా మనస్సులో కొద్దిక్షణాలలో భాసించిన ఊహావిశేషాలు. నా ఇంటికి వచ్చిన ఈ ఆగంతుకుడు తత్తరపడి ఏదో ఊష్మంతో ఉక్కిరిబిక్కిరై పోతున్నాడు. 'అది మీరు తెచ్చారా?' అని ఆ వ్యక్తి కేక పెట్టాడు. అతడు తన ఆదుర్దాలో ఎంతో ఉత్తేజితుడై కన్పించాడు. అలా అడిగేటప్పుడు అతడు నా భుజంమీద చేయి వేసి అమాంతంగా ఒక్కమాటు ఊపి వేయటానికి యత్నించాడు.

“అతడి స్పర్శవల్ల నా రక్తం మంచు సోకినట్లు ఝల్లుమనటం వల్ల నేను అతన్ని వెనక్కు త్రోచి ఉంచాను. "బాబూ! రండి. మీకు ఇష్టమైతే కూర్చోండి. ఇంతకుపూర్వం