Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాఖ్యానాన్ని చేసి సీజర్ సభకు వచ్చేటట్లు చేస్తాడు. సభాభవనానికి తీసుకుపొయ్యే ఉద్దేశంతో బ్రూటస్ ప్రభృతులు సీజర్ ప్రాసాదానికి వస్తారు (అం2 -దృ2). ఆర్టిమి డోరస్ సీజర్ ను జాగ్రత్తగా ప్రవర్తించవలసిందనే సూచికాపత్రాన్ని చదువుతాడు (అం2 -దృ3). భర్త రహస్యాలను తెలుసుకున్న పోర్షియా మానసిక వ్యధను భరించలేక సేవకుణ్ణి సభాభవనానికి వెళ్ళి బ్రూటస్ క్షేమ సమాచారాన్ని తెలుసుకోరావలసిందని పంపిస్తుంది (అం2-దృ4).

శకునజ్ఞులు ఇచ్చిన సూచనలను తిరస్కరించి ఆర్టిమిడోరస్, సీజర్ సభాభవనంలో ప్రవేశిస్తాడు. తాము పూర్వం ఏర్పాటు చేసుకొన్న క్రమాన్ని అనుసరించి, విద్రోహకవర్గంలో ఒకడైన మెటిల్లిస్ సింబర్, దేశబహిష్కృతుడైన తన అన్నను తిరిగి దేశానికి పిలిపించవలసిందని పెట్టుకొన్న వినతిపత్రాన్ని సీజర్ కు సమర్పిస్తాడు. సీజర్ అందుకు వ్యతిరేకాభిప్రాయాన్ని ప్రకటించగా బ్రూటస్ ప్రభృతులు జోక్యం కలిగించుకుంటారు. సీజర్ హత్య జరుగుతుంది. ఈ కల్లోలంలో ఇంటికి పారిపోయిన ఆంటోనీ తిరిగి వచ్చి, తన భావాలను గుప్తంగా ఉంచి సీజర్ అంత్యక్రియోపన్యాసాన్ని ఇచ్చేటందుకు బ్రూటస్ అనుజ్ఞను పొందుతాడు. ఆక్టేవియస్ సీజర్ రోము దగ్గిరవరకూ వచ్చినట్లు వార్తవస్తుంది (అం.3-దృ1). సీజర్ కు తాను ఎందుకు వ్యతిరేకంగా తిరిగి అతణ్ణి హత్య చేయవలసి వచ్చిందో ఆ కారణాలను తెలుపుతూ, బ్రూటస్ విపణి ప్రదేశంలో ఉపన్యసిస్తాడు. ప్రజలు సంతృప్తి వహించి బ్రూటస్ ను మహోదాత్తుడని శ్లాఘిస్తారు. తరువాత మార్క్ ఆంటోనీ సీజర్ మృతి కళేబరంతో ప్రవేశించి ప్రజలను ఉద్రేక పూరితులను గావించే ప్రసంగం చేసి విద్రోహులమీదికి వారు దండెత్తి గృహదహనం చేసేటట్లు చేస్తాడు. బ్రూటస్, కాషియస్ రోము నగరాన్ని వదిలి పెట్టి పారిపోతారు (అం. 3-దృతి). కోపోద్రిక్తమైన సామాన్య జనసముదాయం సిన్నాకవిని చూచి అతడు విద్రోహియైన సిన్నా అని భ్రాంతిపడి అతణ్ణి చీల్చివేస్తారు (అం.3-దృ3).

రోముపాలన వీరత్రయ కూటమి - ఆక్టేవియస్, ఆంటోనీ, లెపిడస్ల హస్తగతమౌతుంది. వారు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి హతమార్చవలసిన సభాసభ్యుల జాబితాను తయారుచేస్తారు. బ్రూటస్, కాషియస్ లను వెన్నాడి ఓడించటానికి పథకం వేస్తారు

(అం.4 - దృ1). సార్డిస్ రంగస్థలంలో బ్రూటస్, కాషియస్ ల మధ్య కలహం ఏర్పడుతుంది (అం. 4-దృ2). బ్రూటస్ తన శిబిరానికి వచ్చిన కాషియస్ ను లంచాలు 16 వావిలాల సోమయాజులు సాహిత్యం-3