పీయూషలహరి
నాంది
ప్రకట : కేసరపుంజ పింజర దళత్మనక
పంకేజ విలసనము శంపా మనోజ్ఞాంశు
మధు శర త్కాదంబినీ డంబరోజ్జ్వలము
పార్వతీ మృదునటోల్లాస లాస్యాంచితము
చక్రక్రమోన్నట త్సాంబశివ చండ తాం
డవము నిర్వ్యాజమ్ము క్షేమ ప్రదమ్మగుచు
సంపూర్ణ దృష్టితో జగము నేలెడు గాత! 1
క్రీడగా కంపించు చంపకమ్ములు గాలి
దేలి చుంబింపగా లీల దూలెడి నల్ల
కలువపూ సొగసు నొల్కించుచును తేలగా
రాస లీలా విలాసముల లాలసలతో
వల్లవీ పల్లవీకృత వల్గిత జ్యోతి
నిరతమ్ము మా యెదల నెలిమి శోభించుతను. 2
నాంద్యంతము
సూత్రధారుడు : (ప్రవేశించి) ఆలస్య మెందులకు? (పరికించి) అహో! ఈ
మధుమాస మెంత మధురముగా నున్నది!
పంపాసరస్సులో కంపించు నలలలో
పర్వెత్తి చల్లనై సొంపులను జల్లు మ
ల్లీ ముకురములపైన చూరాడి వింతగా
మధుపములు హల్లీ సకం బాడ అబ్జముల
1. ఈ నాందికి డా. ఎక్కిరాల కృష్ణమాచార్యుల పద్యానువాదము పీఠికలోని 15వ, పేజీలో కలదు.
పీయూషలహరి
533