Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమాత్యుడు : మీరిట్టి పట్టికల సేకరించుట యందు చక్రవర్తి కోరు సేవకంటే యధికముగా ఇప్పట్టున నిట్టి నాయప్పటి కలతో చక్రవర్తికెట్టి ప్రయోజనమును జేకూరదని నా యభిమతము. వీటినెల్ల పరశురామప్రీతి గావించుటయే మదీయాభీప్సితంబు మీరిందెట్టి జోక్యమును గలుగ జేసుకొనరాదు. ఈ విషయమున పరిపాలకవర్గమువారు నియోగించిన 'ప్రత్యేక సభ'వారే యట్టి సంతోషావిష్టుల గూర్చి యోజించి కొని రావలసి యున్నారని మీకు ఎరుక పరుచుచున్నాడను - ఈ నామపట్టిక యందున్నవారిలో అధిక భాగము మీ బంధువర్గము కాదుగదా!

(ప్రవేశము - ఒక కన్య)

నేను సవినయముగా మనవి చేయగలుగుచున్నాను. ఈ దినమే యొక ప్రత్యేక నివేదిక పాలకవర్గమువారి కార్యాలయమునకు రాగలదని నేను విశ్వసించుచుంటిని.

బుధాదేవి : మంచిది - సంతోషావిష్టులెంతమందిని ఇంతవరకు పరీక్షించారు?

అమాత్యుడు : అట్టి వారెందరైరో నేనిప్పట్టు సంఖ్యాపూర్వకంగా చెప్పలేను. గణకుని పిలిపింతును. రక్షకా!

రక్షకా : చిత్తము

రక్షకుణ్ణి తోసుకుంటూ రాజపుత్రులు, సామంతులు కొందరు కత్తుల కణకణలతో ప్రవేశిస్తారు - రాణిని చూచి భయపడి కరవాలముతో నమస్కరిస్తారు.

అమాత్యుడు : రాజపుత్రులారా! మహారాజ్ఞి యిందు కొలువు దీర్చియున్నవారు. మీరెల్లరు నాకౌక్షేయకములను దూరముగా నుంచి ప్రణామ మొనర్చుడు.

బుధాదేవి : రాజసభలో యుద్దం చేయకూడదనే నిషేధం పూర్వంలేదా?

అమాత్యుడు : అట్టి నిషేధమున్నయది. అయిన

బుధాదేవి : వీరంతా సంతుష్టమనస్కుని అన్వేషించటానికి ఏర్పడ్డ ప్రత్యేక సభలో వాళ్ళేనా?

అమాత్యుడు : తాము పాలకవర్గమువారు నియోగించిన ప్రత్యేక సభవారీ విషయమున వహించు జాగరూకతలను, వారొనర్చిన మహోత్కృష్ట పరిశ్రమను వినుటకుద్యుక్తులు కావలసినదని సవినయముగా మనవి జేయుచున్నాను


492

వావిలాల సోమయాజులు సాహిత్యం-2