Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అది అలా!! నీవు ఇలా!!... పద ఇంటికి. అబ్బాయిని పిలుచుకో వస్తానని నిన్న వచ్చినవాడివి నీవూ ఇక్కడే చచ్చావు? ఇక్కడున్నట్లుగా వాణ్ణి ఇంటికి తీసుకోరా. లేకపోతే నీ తాట వొలిపిస్తాను.

స్వామి: అయ్యా! తామెవరో కాలాగ్ని రుద్రుల్లా వచ్చారు. కానీ వీళ్ళిద్దరూ ధ్యాన యోగసిద్ధిలో ఎన్నో భూమికలు గడిచినవాళ్లు. బలవంతపెట్టి సంసారంలో పడేయకండి. ఇది పాపం !!

జోగన్న: అయ్యా! దొంగ యోగీ!! నిన్ను గురించీ నీ ధ్యానయోగాన్ని గురించీ ఎంతో విన్నాను. నీ గారడీలతో తెలిసీ తెలియనివాళ్ళను ఇలాగే వశం చేసుకొని కర్మభ్రష్టులను చేస్తున్నావట! నీవల్ల కమ్మని సంసారాలు పాడౌతున్నవి. నిన్ను చేరినవాళ్ళకు మోక్షం కలగటం మాట ఎట్లా ఉన్నా నీకు మాత్రం నరకం తప్పదు.

యోగి: (నవ్వుతూ) అజ్ఞానం! అష్టసిద్ధులను సంపాదించిన మాకు నరకమా! అర్థరహితమైన కర్మిష్ఠులు ఇలాగే అంటారు. యోగమార్గంలో...

జోగన్న: యోగం లేదు జోగం లేదు. ఇక కట్టిపెట్టు. నేను నీ దగ్గరికి జ్ఞానోపదేశం కోసం రాలేదు. పిల్లవాణ్ణి పిలుచుకో పోవటానికి వచ్చాను. ఓ కపట యోగీ! మంచి మాటలు చెప్పి మావాణ్ణి ఇంటికి పంపించు. లేకపోతే నీకు ఈ ఊళ్ళోనే జీవసమాధి చేయించకపోతే నా పేరు జోగన్నే కాదు. నేను యజ్ఞ నారాయణ దీక్షితుల తమ్ముణ్ణి కాదు.

స్వామి: (పెద్దపెట్టున నవ్వుతా) ఇది అన్యాయం! దౌర్జన్యం!! అజ్ఞానం.

జోగన్న: ఏడిచావు నీవు మహాజ్ఞానివి! మేము అజ్ఞానులం!!! ఒరేయ్ శంకరం ఇంకా బయలుదేరవేం ఇంటికి... ఓరి వెంకా! వాణ్ణి వెంట బెట్టుకోరా!

శంకరం: నేను రాను బాబయ్యా! ఆ చయనులగారి అమ్మాయిని పెళ్ళి చేసుకోను.

జోగన్న: (కోపంతో) చేసుకోవు. యజ్ఞోపవీతం కూడా తీసేసి ఘోటక బ్రహ్మచారిలా ఉండి ఈ కపటయోగి కాళ్ళు పడుతుంటావు. ఎలా చేసుకోవో చూస్తాను. భ్రష్టుడివైన నీకు ప్రాయశ్చిత్తం చేయించి బలవంతాన్నయినా సరే చయనుల గారి పిల్లనిచ్చి పెళ్ళి చేయిస్తాను. యోగీ!! పిల్లవాణ్ణి పంపించు. వెంకా!! వాణ్ణి వెంట బెట్టుకురా!!


ఏకాంకికలు

473