జోగన్న: శ్యామలా! శ్యామలా!!
రాధమ్మ: ఎవరు? నీవా? వచ్చావా? శ్యామ సుందరా! (కూనిరాగంతో)
నన్ను వలచి వచ్చితివ
నందసుతా! సుందరుడా!!
జోగన్న: ఇటువంటి ఇంట్లో పుట్టిన నీకు ఏం ఖర్మ పట్టింది తల్లీ! శ్యామలా!
రాధమ్మ: కృష్ణా! కృష్ణా!! వచ్చావా!!
జోగన్న: కృష్ణుణ్ణి కాదమ్మ! నీ బాబయ్యను జోగన్నను వచ్చాను.
వెంకడు: అమ్మా! రాధమ్మగారూ! మీ బాబయ్యగారు, చినబాబుగారు వచ్చారమ్మా! పెదబాబుగారిని చూచి వచ్చారుటమ్మా!
రాధమ్మ: ఎవరు? వెంకా!!
జోగన్న: వెంకా! ఇక నువ్వు వెళ్ళి నేను వచ్చానని చెప్పి అబ్బాయిని ఎక్కడున్నా సరే తీసుకురా! ఉఁ వెంటనే వెళ్లు.
రాధమ్మ: ఎవరది? బాబయ్యా! ఎప్పుడు వచ్చావు?
జోగన్న: పది నెలలు సంచారం చేసి మొన్ననే ఇంటికి వచ్చాను. వెంకడు వ్రాయించిన ఉత్తరాలు చదువుకొని గుండె నీరై వెంటనే ఇలా కొట్టుకో వచ్చాను. ఈ భక్తులేమిటి? ఈ భజనలేమిటి? ఎంత పిచ్చిలో పడ్డావమ్మా?
రాధమ్మ: సర్వజన ప్రియుడైన కృష్ణ పరమాత్మను భక్తితో సేవించటంలో పిచ్చేముంది బాబయ్యా! నాన్నగారు వెళ్ళిపోయిన తరువాత మహాభక్తురాలు నారాయణమ్మ ఇంత కృపావీక్షణం నామీద ప్రదర్శించింది. 'నాలుగు దారుల్లో' సర్వోత్కృష్ట మైంది భక్తని తెలుసుకున్నాను.
జోగన్న: భక్తితో భగవంతుణ్ణి సేవించటం చెడ్డ మార్గమని ఎవరంటారు? కానీ అమ్మా! శ్యామలా! నా కడుపున పుట్టిన మాణిక్యం కంటే నీవంటే నాకెంతో మమకారమమ్మా! అర్థరహితంగా చిన్నతనంలోనే ఆత్మహత్య చేసుకొని మా అల్లుడు నిన్ను నట్టేటిలో ముంచినప్పుడు నమ్ము శ్యామలా నేను నాలుగు రోజులు అన్నం కూడా ముట్టలేదు.
ఏకాంకికలు
467