Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లక్షణాలు. ఎంత అదృష్టవంతులకో గాని, పూర్వజన్మలో ఎంతో మహాపుణ్యం చేసుకున్న వాళ్ళకు గాని లభించని లక్షణాలు! అందుకోలేని ఆశయాలు! ప్రభువులను ప్రేమించి వారు ప్రణయ భుజ పంజర కీరాలై శుకానువాదం చేస్తున్నప్పుడు కలిగే పరితృప్తి, మహాప్రభువులు మనసారా ప్రేమిస్తే వారి ఆజానుబాహువులను ఆధారం చేసుకొని అల్లుకుపోయే ప్రణయ లతికలమై ఆనందరసోన్మత్తతలో 'ప్రభూ' అని పలవరించుటము ఒక జీవికి ఎన్ని జన్మలకో!... మహాప్రభువు కలశ భూపతిది ఎంత జాలిగుండె తల్లీ - ఆయన ఎంత చక్కనివాడు ఎంత రసికుడు. (తన మెడలో ఉన్న హారాన్ని చూచుకొని సవరించు కుంటుంది) సారంగదేవి : షట్పదీ! నీ ప్రసంగం ఇక చాలించు. నా మనస్సుకు బాధ కలిగిస్తున్నది. షట్పది : అమ్మాయీ! మీ తండ్రిని ప్రేమమూర్తి అని అభినందిస్తుంటే నీకు బాధేందుకు తల్లీ! సారంగదేవి : ఆయన ప్రేమమూర్తి కాడని కాదు. ఆయన ప్రేమమూర్తని ఎరగక కాదు ఆయన ప్రేమమూర్తని నీవు చెప్పే లక్షణం నాకు నచ్చలేదు. నాకు మహా బాధ కలిగించింది. షట్పది : (సారంగదేవి చేతులు స్పృశిస్తూ) అమ్మాయి! వెర్రిదానా. నీమీద అనురాగం లేకనా ప్రభుహృదయాన్ని గురించి నీతో ప్రసంగించటం. సారంగదేవి : (బిగ్గరగా) షట్పదీ. నా కోపం అధికమౌతున్నది. మరొక మాటు మహారాజు ప్రశంస రానిచ్చావా నీకు మర్యాద దక్కదు... (షట్పది మెడలో హారాన్ని నిర్దేశిస్తూ) నీకెక్కడిదా హారము? ఎవరిచ్చారు? ఇదివరకు నీ మెళ్ళో లేదే! ఇది మహారాణిది కదూ. నీకెలా వచ్చింది. చెప్పవూ? చెప్పవూ? (కజ్జలాదేవి ఈ సంభాషణ వింటూ ఒక్కమాటున కదిలి లేస్తుంది) షట్పది : చెప్పకూడదు. సారంగదేవి : నాదగ్గిర దాపరికమా షట్పదీ! ఉఁ హారమెవరిచ్చారు? కజ్జల : మహారాజు! మహారాజు!! 390 వావిలాల సోమయాజులు సాహిత్యం-2