కంచుకి : కజ్జలా! కోపం తెచ్చుకోకు. శాక్తేయపంక్తి కంఠస్వామి ప్రజ్ఞ - అసామాన్యంలో యావద్భారతంలో ప్రఖ్యాతి పొందింది. అంతటి మహాత్ముడి అండ ఉండి కూడా ఆశ్రయలోపం వల్ల ఆశయ సాఫల్యం పొందలేకపోవటం మన దురదృష్టం - అవ్యక్తత.
కజ్జల : సమస్త శక్తులూ నాకరాగతాలౌతవా?
కంచుకి : ఇంకా సందేహమా?
కజ్జల : (యోచనాపూర్వకంగా) నా ఆత్మ మహారాజుది. పంక్తికంఠ స్వామి నీచ కైంకర్యానికి కాశ్మీర రవికిరణ సంఫుల్ల కైరవం - ఈ దేహాన్ని ఉపహారం చేయగలుగుతానా?
కంచుకి : మనస్సులో మహారాజును స్మరించుకుంటూ, కాసేపు కళ్ళు మూసుకొని...
కజ్జల : నగ్నంగా... శక్తి ముందు నేనూ నా మీద భయంకర శాక్తేయకరాళ హస్తాలు - నా జీవధనాన్ని నిమిషంలో దోచుకుంటాడా... బాబో మనస్సు అంగీకరించటంలేదు.
కంచుకి : ఆశయంతో పోలిస్తే నీ త్యాగమెంత? శక్తికి దేహాన్ని ఉపహారంగా ఇవ్వలేని నీకు మహత్తరమైన ఈశ్వితశక్తి ఎలా వస్తుంది. సాధనను బట్టే గదా సిద్ధి.
కజ్జల : కంచుకీ! నన్నేదో మోహ మహాసముద్రంలో ఈదించబోతు న్నావు. ఉంః... విజయం హస్తగతం కాకపోయినాసరే. ఈ నీచమార్గాన్ని అనుసరించలేను కంచుకీ. నా పవిత్రదేహాన్ని బలిపీఠం ఎక్కించలేను కంచుకీ
(రెండు చేతులతో తల పట్టుకుంటుంది)
కంచుకి : శుభాశుభాలనే అవధులందని జలధుల్లో మానవులు తట్టాడుతుంటారు. ఎవరో సాహసికులు కాని ఆ మహా సాగరాన్ని తరించి బయటపడలేరు - తరించినవాళ్ళకు ఈశిత్వమూ! వశిత్వమూ! త్రిలోక ప్రాభవమూ! కజ్జలా! కరతలామలకాలు కాబోతూ ఉన్న మహత్తర సౌఖ్యాన్నీ విజయాన్ని చేతులార చెడగొట్టుకోవద్దు. ఆలోచించుకో!
కజ్జల : రుగ్మత నా గుండెలు బ్రద్దలు చేస్తున్నది. ఈ క్రూర కర్మకు ఎదురు నిల్చే ధైర్య సాహసాలు దానికి లేవు. కంచుకీ - ఆ ప్రసంగమిక చాలించు. అనుభవించిన సౌఖ్యం చాలు. వెనక హస్తగతమైన విజయం చాలు. మోహానికి నిముషం లొంగానా నా జీవనావ మునిగిపోతుంది.
ఏకాంకికలు
385