కజ్జల పూర్వార్ధము ప్రథమ దృశ్యము (రాజాంతఃపుర సౌధోపరిభాగం. సౌధం చుట్టూరా నగర ప్రజలంతా 'యువరాజు' ముఖ దర్శనార్థం నిరీక్షిస్తూ హర్ష ధ్వనులతో, కేరింతలతో, గుమికూడి ఉంటారు. సౌధోపరి భాగంలో కాబొయ్యే యువరాజుకు నీళ్ళు పోసి, అగరు ధూపాలతో కురులారుస్తూ స్త్రీలు మంగళహారతు లెత్తు తుంటారు. అతడు అక్క సారంగదేవి చేతుల్లో హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఒక మూలన బంగారు గొలుసులు ఉయ్యెల. రెండువైపులా దీపపు సెమ్మెలు - కర్పూరపు వాసనలు - అగరుధూప పాత్రికలు ప్రస్తుతము మహారాణి అనే పేరుతో వ్యవహరిస్తూ ఉన్న కజ్జల (దేశాధిపతి ఉంపుడు కత్తె) రాజసంతో ఒకమాటు పసిబిడ్డనూ, మరొకమాటు జన సమూహాన్ని చూస్తూ మంగళగీతం వింటూ ఆనంద పరవశురాలై అలసటవల్ల నిట్టూరుస్తూ ఉంటుంది. సారంగ దేవి చేతుల్లో నుంచి పిల్లవాడిని ఉయ్యాలలో నిద్రపుచ్చుతూ జోలపాట పాడుతుంటారు. చత్వర నుంచి సౌధం ముందు గుమిగూడి "కజ్జల మహాదేవికీ జై” అనే సంతోష సూచక ధ్వనులతో ఉప్పొంగిపోతూ ఉన్న ప్రజలను చూస్తూ నిలుచున్న కజ్జల మంగళగీతం పూర్తికాగానే ఒక మాటు హఠాత్తుగా వెనకకు తిరిగి కుమార్తె సారంగదేవితో) కజ్జల : ఒకమాటు కుమారుణ్ణి ప్రజలకు చూపించు. సారంగదేవి : (పసిబిడ్డను కంచుకి చేతికిస్తుంది) కజ్జల : అమ్మాయీ! నీవే తమ్ముణ్ణి ప్రజకు చూపించు. సారంగదేవి : (అనుమానిస్తూ) నేనా! కజ్జల : అవును నీవే. ఈ దినంకూడా నిన్ను చూడటానికి ప్రజ తహతహ పడుతూ ఉంటుంది. ఏకాంకికలు 375
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/375
Appearance