పోతన్న : (మోకాళ్ల మీద చేతులు పెట్టుకొని కూర్చోబోతూ) రామచంద్ర ప్రభో! రామచంద్ర ప్రభో (నెమ్మదిగా కూర్చున్న తరువాత) శ్రీనాథుడు : బావగారూ.... ఎక్కడ నుంచి? పోతన్న : అదుగో! పోతవరం పొలిమేరలలో పెద్ద మర్రిచెట్టు నాయనా, విస్తరాకుల కోసమని వెళ్ళి వస్తున్నాను. శ్రీనాథుడు : మీకు వృద్దాప్యం వచ్చేసింది. పోతన్న : రాకేముంది. షష్టిపూర్తికి నాలుగో మెట్టులో ఉన్నాను? - ఇదుగో ఈ పని బడి నీతో పగలు భోజనం చేసిన తరువాత మాట్లాడటానికి అవకాశం లేకపోయింది. ఊఁ ఇప్పుడేమన్నా కొత్తకావ్యం చెపుతున్నావా? శ్రీనాథుడు : రాజమహేంద్రవరం రెడ్డిరాజు వీరభద్రారెడ్డికి వచ్చే వసంతోత్సవాలల్లో కాశీఖండం అంకితమివ్వాలి. పోయిన ఆషాఢారంభంలో కర్పూరపు తాంబూలము అందుకున్నాను. వ్రాస్తున్నాను. - పోతన్న : గ్రంధం సగభాగమైనా అయిందా? మొదటినుంచీ నీ కావ్యకన్యకు ప్రౌఢతేనోయ్ - శ్రీనాథుడు : ప్రౌఢలను మహారాజులుగాని ఏలుకోలేరని నా అభిప్రాయం. పోతన్న : నీ ఛలోక్తి నేను ఉద్దేశించలేదు.... నాయనా! శ్రీనాథుడు : బావగారూ! మల్లన్న వినిపిస్తే మీ భాగవతము విన్నాను. పోతన్న : నా భాగవతమా! నాదేముంది నాయనా! అది వ్యాసభగవానులు భాగవతము. శ్రీనాథుడు : మీరు వారి అపరావతారము. మీ ఆంధ్రీకరణమార్గం అన్యకవిపాంథగమ్యం కానిది. పోతన్న : ఆ ఆంధ్రీకరణములో నా ప్రతిభ ఏముంది తండ్రీ! ఆ రామచంద్రమూర్తి నా జిహ్వాగ్రంలో నిలిచి ఏం పలికిస్తే అది వ్రాశాను - భాగవతకర్త శ్రీరామచంద్రమూర్తి కాని మరెవ్వరూ కాదు. ఏకాంకికలు 363
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/363
Appearance