ఈ పుట ఆమోదించబడ్డది
కామ్రేడ్ : (కొంచెము ఓదార్చుకొని) సభాపతి కళ్ళు మూయగానే ఎక్కడిదో ఒక లాటీదెబ్బ వచ్చి మీ అబ్బాయి కణతకు తగిలింది. అబ్బాయి.... బల్ల దగ్గర...
తల్లి : (తిరిగిపోతూ ఉన్న కళ్లతో) ఆఁ!
కామ్రేడ్ : (ఆమె ముఖం చూడలేక జేబు రుమాలు అడ్డం పెట్టుకొని భోరుమని ఏడుస్తూ) చనిపోయి... నేలమీద..... ఉన్నాడు.
తల్లి : (పెద్ద కేకతో వీథి గుమ్మంలో వెనక్కు పడిపోయింది. బజారులో ఎలక్ట్రిక్ లైట్లన్నీ ఒక్క తడవగా ఆరిపోతాయి. ఆనాటి అమావాస్య చీకట్లో కళ్ళు పొడుచుకొని చూచినా, కనుపించినా కనపడని ఆకాశంలో నవజీవనం వెళ్ళబోస్తూ ప్రకాశవంతంగా మెరుస్తున్నది ఒక తార).
సమాప్తము
అముద్రితం
342
వావిలాల సోమయాజులు సాహిత్యం-2