Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భుజంగం : ఓ వెయ్యి రూపాయలు మనవి కాదనుకుంటే మద్రాసులో మనపని జరిగిపోతుంది -

చంద్రశేఖరం : పోనీ ఎవడికో మందుపెట్టి చంపినట్లు వైద్యుడు కదూ ఎవడో చావకుండా ఉంటాడా అతని చేతిలో.

భుజంగం : మహజరు వెనక మరిన్ని సంతకాలుంటే కఠినశిక్ష చెప్పించవచ్చు కూడా. మోతుబరీ సాక్ష్యం బనాయిద్దాము.

చంద్రశేఖరం : మిల్లుదగ్గిర రైల్వేస్టేషను పెట్టించాలని అప్లికేషను వ్రాసి సంతకాలు పుచ్చుకుంటాను. ఓ నాలుగువేలు అయిన తరువాత దానికి ఈ మహజరు టైపుచేసి గుచ్చుదాము.

భుజంగం : భేష్ ! ప్లాను బ్రహ్మాండంగా ఉంది.

(సేవాసమితి ఆఫీసుముందుగా చైతన్యం, ప్రజాసేవకులతో పాట పాడుతూ వెళ్ళుతుంటాడు)


భారత జయఘంటా! ఓహో
భవ్య విజయ ఘంటా!!
గణ గణ గణ గణ,
క్వణియింపుమురా! భారత జయ....

మానవ మానస -
మహిమ జలేజము
మధుధారలతో
తిలకింప గణ, గణ....

ఋషిగణవాటీ
తుషితప్రశాంతి
కమ్రహాసముల
కుళుకుల నీన గణ, గణ.....

విశ్వహృదంతర
విమలాలయముల


264

వావిలాల సోమయాజులు సాహిత్యం-2