రెండో దృశ్యం
(గురిజాలలో నాగమ్మ కార్యాలోచనా మందిరము. ఒక వేదిక మీద బ్రహ్మనాయుని
చిత్రపటమూ, మరొక వేదిక మీద ఎడమ వయిపు ప్రళయతాండవం చేస్తూ వున్న
నటరాజస్వామి విగ్రహమూ మోకరిల్లి భక్తి భావముతో తదేక నిష్ఠతో అంజలి పట్టి)
నాగమ్మ : (ఉచ్చ కంఠంతో)
జయ మృత్యుంజయ దేవ మహేశా!
ప్రమథాధిప భూతేశ పరేశా!!
త్రియంబక, త్రిపురాంతక,
అంధకరిపు, గంగాధర - జయ...
జయ పినాకి జయ కృశాను
హే మహేశ, వ్యోమకేశ -
జయ మృత్యుంజయ దేవ మహేశా!
ప్రమథాధిప భూతేశ పరేశా!!
(నెమ్మదిగా లేచి ఠీవితో బ్రహ్మన్న చిత్రపటాన్ని పరికించి వికటంగా నవ్వుతూ)
బ్రహ్మన్నా! బ్రహ్మన్నా!! నీకీ నాయకురాలితోనా పగ. కాలకూట విషంతో నా చెర్లాటము. ఏనాడు నీవూ, ఈ నలగామరాజూ నా తండ్రిని ఉరికంబాని కెక్కించారో ఆనాడే కంకణం కట్టుకున్నాను.
(ముంజేతి కంకణం వైపు జూస్తుంది).
గొల్లగుంపులను పోగుచేసి దేశాన్ని కొల్లగొట్టి అరాజకం చేద్దామను కున్నాను. కాని మృత్యుంజయ కృప నామీద ప్రసరించింది. నలగాముడి కంటబడ్డాను. ఇక ఆట ఆడించంది మానను.
అయినా! బ్రహ్మన్నా, నీవూ అసామాన్యుడివి. అరణ్యవాస సమయంలో హత్య చేయించటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. తప్పించుకున్నావు. మలిదేవులు అర్ధ
26
వావిలాల సోమయాజులు సాహిత్యం-2