Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుడే : ష్వయం హెళ్ళీ. హాయ్ హేమ్టీ హదీ (జ్ఞప్తిచేసుకుంటూ) బిచ్చికోత్ హోక్టీడబ్బా. మళ్ళీ షెక్కర్ కేళీ హోక్టీగేలా, డిర్రింగు హోక్టీ డజన్, తెచ్చానుగా హమ్మాయ్‌గార్!

జయ : ఉఁ - పుస్తకం తెచ్చి యిచ్చి విందుకని వచ్చినవాళ్ళందరినీ మర్యాద చెయ్యి.

బుడే : పుస్తకం (తెలిసినట్లు) పేకట్ హమ్మాయిగార్!

జయ : ఆఁ (బుడే అక్కడేవున్న పాకెట్ ఇస్తాడు. అది చైతన్య వ్రాసిన 'సేవాగీతికలు)'

కవీ : చైతన్యం” - సేవాగీతికలు! బుడే! ఇదిగో నీకు నజరానా? వెళ్ళు.

బుడే : (సంతోషంతో తీసుకొని సలాం చేసి వెళ్ళిపోతాడు)

జయ : (పుస్తకం తిరగవేస్తూ) అన్నీ విన్న పాటలేనే! (హార్మోనియం దగ్గరకు వెళ్ళి) ఇది కూడా చైతన్యందేనా?


ఆపకం డీరథము
స్వాతంత్ర్య రథమూ
జహ్వారే సారథై
సాగించు నీ రథము ఆపకం డీరథము....

వెలుగుకాగడ తోడ
వెడలుచున్నాడడుగొ!
పొడుపుమలదెస కింక
పొలచు నూతనజ్యోతి ఆపకండీరథము....


పుణ్యకోటి : (ప్రవేశిస్తూ) హల్లో మీ ఆనందానికి అడ్డు వస్తున్నందుకు క్షమించాలి.

(చేతిలో ఉన్న 'సేవాగీతికలు - చైతన్యం' మీద దృష్టి ఉంచి) పాటలా ఏమిటి? ఈ పాట ఎవరిది చెప్మా! ఎక్కడో విన్నట్లుంది?

జయ : చైతన్యంగారివి.

పుణ్యకోటి : అతడు మంచి కవే! కానీ

జయ : (అనుమానంతో) కానీ....

పుణ్యకోటి : వేపకాయంత కొసవెర్రివాడు.

జయ : ఆలోచిస్తే వెర్రిలేనిదెవరికి? - మీకు లేదా - నాకు లేదా?


222

వావిలాల సోమయాజులు సాహిత్యం-2