ఈ పుటను అచ్చుదిద్దలేదు
పుట 203 - దైవమొకడు లేడు. ఇది యదార్థము దైవమొకండు లేఁ, డిది యథార్థము, దోష మొకింత లేని నా పై వచియింతురే యిటుల వధ్యుఁడ వన్న కఠోరశిక్షయా దైవమె యున్నచో - నలమె దారుణనీలకళంకపంక మ న్నా! విబుధాలయంబు డిగి నాప్రియ క్షాళన చేయుఁ గావుతన్ పుట 204 - (శిరస్సు మీద చేయి ఉంచి) లే లే లెమ్ము కృపాళు, ఓ కరుణశీలీ! లెమ్ము, లేవయ్య నే నీలీలన్ జొర మృత్యుగహ్వరము తండ్రీ! యొడ్డి నీ ప్రాణముల్ యేలా రక్షణసేయఁ బూనెదవు - నీవే యాప్తబంధుండ నో యీ! లే లెమ్ము విధాత యడ్డుపడియెన్ ఈ ప్రాణరక్షాక్రియన్ పుట 205 - కాదు. వసంతసేన ఏమి? వసంతసేన యగునే, ప్రతిరూపమె! కాదు, ఆమెయే - యీమెయె స్వర్గభూమిడిగినే నను గావఁగ, సర్వమీయెడన్ ఏమిది? భ్రాంతి యౌనె? హృదయేశ్వరి స్వర్గము చేరలేదెమున్ ఆమనిపూలతోఁట కెనయై యిటువచ్చె వసంతసేనయే. 212 వావిలాల సోమయాజులు సాహిత్యం-2