Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్మోన్నతమూర్తి అతనికి యున్నదె బేలతనమ్ము! పుత్రు డీ
కన్నమదాసు మేన నుడు కారని నెత్తుటి కాల్వ లుండగన్ -


(బ్రహ్మన్నతో) తండ్రీ! నమస్కారము (కొమ్మన్నతో) మామా! దీవించు.

కొమ్మన్న : (కన్నమను చేరి బుజం మీద చరుస్తూ) సంతోషము, కన్నమా! సంతోషము. తండ్రి బ్రహ్మన్నకు బేలతనమన్నమాట. సహించ లేక ఎంత ఆటోపం చేశావోయ్! (బ్రహ్మన్నతో) మహామంత్రీ! దేశం నిన్ను ఎలా గౌరవించి మీ అడుగు జాడల్లో నడవటానికి సంసిద్ధమైందో గమనించారా? ఈగను వాలనివ్వదు మీమీద.

కన్నమ : (వినయ పూర్వకంగా) క్షమించు మామా! ఎవరో తండ్రికి అపచారం చేస్తున్నా రనుకున్నాను.

కొమ్మన్న : తండ్రీ కన్నమా! కూర్చో...

(కొమ్మన్న తన వేదిక మీద కూర్చున్న తరువాత కన్నమదాసు తానూ వేదిక మీద కూర్చుంటాడు)

బ్రహ్మన్న: (శాంత గంభీర కంఠంతో) కన్నమా!

కన్నమ : (గౌరవ పురస్సరంగా) తండ్రీ!

బ్రహ్మన్న : నీవు అభ్యసిస్తూ వున్న అహింసా మార్గం ఇంత వరకూ వచ్చిందా? ఇలా ఆ దేవతను ఉపాసించటం ఎంతో కష్టం.

కన్నమ : (సిగ్గుతో తల వంచుకొని) సమస్త విషయాలల్లో దాన్ని పాటించ గలను. కాని, మీమీద అపచార విషయంలో నాకు ఒళ్ళు తెలియదు తండ్రీ!

బ్రహ్మన్న : (నింపాదిగా మంచిది, మంచిది.

కొమ్మన్న : (వాతాయనం వైపు చూచి) అలరాజు రథం వచ్చేస్తున్నది., అదుగో కారుబొల్లడి డెక్కల చప్పుడు. మహారాజుకు మళ్ళా పిలుపు వెళ్ళాలా?

బ్రహ్మన్న : ఆయన సమయానికి వస్తామన్నారు.

(రథ మాగిన ధ్వని. కొమ్మన్న బ్రహ్మన్న లిద్దరూ లేచి ద్వారా దేశం సమీపిస్తారు. రథం దిగి ద్వారం దగ్గరికి వచ్చిన అలరాజు బ్రహ్మన్న కొమ్మన్నలు ఎదురువస్తే)

అలరాజు : మామా! ఈ ఆచారమేమిటి? మహామంత్రులు మీరు నాకు ఎదురు నడవటమా! తండ్రీ! క్షంతవ్యుణ్ణి.


నాయకురాలు

21