పన్నెండో దృశ్యం [శకారుని జీర్ణోద్యానం - వసంతసేన ఏకాంతంగా ఒకపూలమొక్క మీద వాలిన తుమ్మెదను నిశ్చలంగా చూస్తూ సాభిప్రాయంగా] తుమ్మెదవా!, తుమ్మెదవా!! నమ్మరాని తుమ్మెదవా! మనసిచ్చిన పాటలతో మరులు కొల్పి మా కన్నెల మధువానిన వెనుక నీవు మరల మోము చూపింపవు విలపింపకు లేయెడదల విలపించెడు వేదనతో విరహభార మెరుగక ఈ - విరులు మనసు దొరుకదు పో- తుమ్మెదవా! తుమ్మెదవా!! నమ్మరాని తుమ్మెదవా! తుమ్మెదవా? (ఉద్విగ్న హృదయంతో) ఆర్య చారుదత్తా! ఏ ఉద్యానంలో కూర్చొని మీరూ కలలు కంటున్నారో! బండి తారుమారైంది, నా అదృష్టంతోపాటు, ఈ జీర్ణోద్యానం చేరుకున్నాను. మరుక్షణంలో ఏమి రాబోతున్నదో ఎరుగను. అయ్యో! ఆషాఢమేఘరాజు గర్జించి ఎంత చెప్పినా వినకుండా మూర్ఖం చేసి, ఆ మహాత్ముణ్ణి తిట్టిపోసి బయలుదేరివచ్చాను. ఈ అనుభవం కోసమే నేమో! (మరొకదిక్కుచూచి) తనకుసుమామోదాన్ని గ్రహించి ఆనందించి అనుభవింప జేసే మధుకర ప్రియుడు రాలేదు కాబోలు పాపం! ఈ జాజిపూవు తేనెకన్నీటి బొట్లు నేలరాల్చేస్తూ ఉన్నది. ప్రభూ! నీ ప్రియసుమము కూడా ఈ దురదృష్టానికే నోచుకున్నదా? (బిగ్గరగా) మహాభాగా! మహాభాగా!! ఇక్కడ నాకు దిక్కెవ్వరు? 182 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/182
Appearance